1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kowsalya
Last Updated : గురువారం, 28 జూన్ 2018 (09:42 IST)

ప్రతిరోజు క్యాబేజీ రసాన్ని త్రాగితే? కంటికి?

రోజూ అరకప్పు ఉడికించిన క్యాబేజీని తింటే శరీరానికి అవసరమయ్యే విటమిన్ సిలో 35 శాతం లభిస్తుంది. క్యాబేజీని హాఫ్ బాయిల్‌తో తీసుకోవడం వలన బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. క్యాబేజీని

రోజూ అరకప్పు ఉడికించిన క్యాబేజీని తింటే శరీరానికి అవసరమయ్యే విటమిన్ సిలో 35 శాతం లభిస్తుంది. క్యాబేజీని హాఫ్ బాయిల్‌తో తీసుకోవడం వలన బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. క్యాబేజీని సూప్ రూపంలో తీసుకుంటే పొట్ట తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఒబిసిటీకి క్యాబేజీ దివ్యౌషధంగా సహాయపడుతుంది.
 
క్యాబేజీలోని సల్ఫొరాఫేన్ క్యాన్సర్ వ్యాధుల్ని అడ్డుకుంటుంది. రొమ్ము క్యాన్సర్ కారణంగా తలెత్తే కంతనల పరిమాణఁ పెరగకుండా క్యాబేజీలోని ఎపిజెనిన్ అనే రసాయనం అడ్డుకుంటుంది. క్యాబేజీలో అధికంగా ఉండే బీటా కెరోటిన్, ల్యూటెన్, జియాక్సాంథిన్, క్యాంఫెరాల్, క్యుయెర్సిటిన్ వంటివి ఇందులో ఉంటాయి. క్యాబేజీలోని యాంటీ ఆక్సిడెంట్స్ కంటి కండరాల బలహీనతను నిరోధిస్తాయి. 
 
విటమిన్ కె ఎక్కువగా ఉండే వంకాయరంగు, ఎరుపు రంగుల క్యాబేజీ ఆల్జీమర్స్ వచ్చే ప్రమాదం నుండి కాపాడుతుంది. క్యాబేజీలో క్యాల్షియం, మెగ్నిషియం, పొటాషియం వంటి ఖనిజాలు ఎముకల సాంద్రతను నివారిస్తాయి.