మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 9 మే 2017 (12:17 IST)

కీరదోస, నిమ్మ ముక్కలు, పుదీనా, అల్లం కలిపిన నీటిని సేవిస్తే?

బరువు తగ్గాలంటే.. కీరదోస, నిమ్మ ముక్కలు, పుదీనా వంటివి కలిపిన నీటిని తీసుకోవడం ద్వారా శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. అదనపు కొవ్వును కరిగించడంలో ఈ నీళ్లు ఎంతగానో ఉపకరిస్తాయి. రాత్రిపూట తక్కువ

బరువు తగ్గాలంటే.. కీరదోస, నిమ్మ ముక్కలు, పుదీనా వంటివి కలిపిన నీటిని తీసుకోవడం ద్వారా శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి. అదనపు కొవ్వును కరిగించడంలో ఈ నీళ్లు ఎంతగానో ఉపకరిస్తాయి. రాత్రిపూట తక్కువ ఆహారం తీసుకున్నప్పటికీ.. నీరసాన్ని దూరం చేసుకోవాలంటే.. పండ్లు, మజ్జిగ వంటివి తప్పనిసరిగా తీసుకోవాలి. 
 
ఆహారాన్ని మానేయకుండా.. శరీరానికి శక్తినిచ్చే ఆహారాన్ని తీసుకోవాలి. ఇంట్లో చేసిన పదార్థాలకు ప్రాధాన్యమివ్వాలి. నూనె, తీపి వస్తువులను మితంగా తీసుకోవాలి. రాత్రిపూట మంచినీళ్లు ఎక్కువగా తాగాలి. రాత్రిపూట లేచి ఒక గ్లాసుడు నీరు సేవించాలి. జిమ్‌, యోగా వంటివి చేయకపోయినా తప్పకుండా ఉదయపు నడకకు ప్రాధాన్యం ఇవ్వాలి.
 
ఆలస్యంగా నిద్రపోవడం, తినడం వంటివి ఏ మాత్రం మంచిది కాదు. ఇలాంటి జీవన శైలికి అలవాటు పడితే.. క్రమంగా బరువు పెరిగి ఊబకాయానికి దారితీయొచ్చు. అందుకే ఎనిమిది గంటలలోపు తినేసి... సమయానికి నిద్రపోవడం అలవాటు చేసుకుంటే బరువు సమస్య ఉండదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.