ఇయర్ బడ్స్ ఉపయోగిస్తున్నారా? వినికిడి లోపం తప్పదండోయ్..!

సోమవారం, 29 మే 2017 (11:03 IST)

ఇయర్ బడ్స్ ఉపయోగిస్తున్నారా? బడ్స్ ద్వారా ఇయర్ వాక్స్ తొలగించడం ద్వారా కొన్నిసార్లు చెవిలోని సున్నితభాగాలు దెబ్బతింటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇయర్‌ వాక్స్‌ అనేది కొన్ని రోజుల తరువాత దానంతట అదే బయటకు వచ్చేస్తుందనీ, ప్రత్యేకించి దానిని తీసేయవలసిన అవసరం లేదంటున్నారు. ఇలా తీసివేసే క్రమంలో కొన్నిసార్లు కర్ణభేరి దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు.
 
ఇయర్ బడ్స్, హెడ్ ఫోన్స్, ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ డివైస్‌ల వల్ల చెవిపోటు తప్పదట. మొబైల్ ఫోన్లను విపరీతంగా వాడటం ద్వారా ఐపాడ్స్, ఎంపీ3 ప్లేయర్స్, కంప్యూటర్లు, టాబ్స్ వంటి అత్యాధునిక పరికరాల వల్ల చెవికి, కంటికి దెబ్బేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇయర్‌బడ్స్‌ ఉపయోగించడం వలన అమెరికాలో ప్రతిరోజు సుమారు 34 మంది గాయపడి ఆసుపత్రుల్లో చేరుతున్నారట. 
 
వీరందరూ నాలుగునుంచి ఎనిమిది సంవత్సరాల లోపు పిల్లలు కావడం గమనించవలసిన అంశం. ఇయర్ బడ్స్ ఉపయోగించడం ద్వారా కర్ణభేరి దెబ్బతింటుందని.. దీంతో వినికిడి సమస్యలు ఉత్పన్నమవుతాయట. అలాగే ఐపాడ్, ఎంపీ3 డివైస్లను ఉపయోగించడం ద్వారా కూడా ఈ సమస్య తప్పదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.దీనిపై మరింత చదవండి :  
Bluetooth Hearing Health Big Trouble Head Phones Ear Buds Mp3 Players

Loading comments ...

ఆరోగ్యం

news

భారత్‌లోకి ప్రవేశించిన ప్రమాదకర వైరస్ జికా?

ఆఫ్రికా దేశాలను భయభ్రాంతులకు గురిచేసిన ప్రాణాంతక జికా వైరస్ భారత్‌లోకి ప్రవేశించింది. ...

news

'ఓ' గ్రూపు వారికి గుండెపోటు ముప్పు లేదా? సర్వే ఏం చెపుతోంది!

ప్రస్తుతం మారుతున్న జీవనపరిస్థితుల దృష్ట్యా గుండెపోటు ముప్పు ప్రతి ఒక్కరినీ వేధిస్తోంది. ...

news

చెర్రీ పండ్ల గురించి 5 పాయింట్లు...

చెర్రీ పండ్లలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అందుకే వీటికి చాలా ప్రాముఖ్యతనిస్తుంటారు వైద్యులు. ...

news

ఒత్తిడితో తలపట్టుకుంటున్నారా? యాలకుల టీ తాగేయండి..

ఒత్తిడితో తలపట్టుకుంటున్నారా? యాలకుల టీ తాగేయండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. ఒత్తిడిని ...