శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 9 జూన్ 2018 (11:05 IST)

వర్షాకాలంలో మాంసాహారాన్ని ఇలా తీసుకుంటే?

వేసవి కాలం వెళ్ళిపోయింది. చిరుజల్లులు మొదలయ్యాయి. ఈ సీజన్‌లో వ్యాధినిరోధక శక్తిని పెంచుకునే దిశగా ఆహారం తీసుకోవాలి. సీజన్ మారడం ద్వారా వేధించే జలుబు, తలనొప్పి, దగ్గు లాంటి ఇబ్బందులను దూరం చేసుకోవాలంటే

వేసవి కాలం వెళ్ళిపోయింది. చిరుజల్లులు మొదలయ్యాయి. ఈ సీజన్‌లో వ్యాధినిరోధక శక్తిని పెంచుకునే దిశగా ఆహారం తీసుకోవాలి. సీజన్ మారడం ద్వారా వేధించే జలుబు, తలనొప్పి, దగ్గు లాంటి ఇబ్బందులను దూరం చేసుకోవాలంటే.. వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవాలి. ఇందుకోసం ఆకుకూరలు, పండ్లు, డ్రైఫ్రూట్స్ వంటి మంచి పోషకాలు అందించే వాటిని తీసుకోవాలి. 
 
ఈ ఆహారం వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. వర్షాకాలంలోనూ నీటిని తగిన మోతాదు తీసుకోవాలి. నీటిని కాచి చల్లార్చి తాగడం లేదా శుద్ధి చేసిన నీటిని తాగటం ఎంతో ముఖ్యం. అలాగే విటమిన్ సి వున్న ఉలవలు, నువ్వులతో చేసిన పదార్థాలు తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. 
 
వర్షాకాలం సమయంలో మన శరీరానికి త్వరగా ఆహారం జీర్ణం చేయడానికి కష్టతరంగా ఉంటుంది. అందువల్ల మీ జీర్ణక్రియ మెరుగుపర్చే క్రమంలో వెల్లుల్లి, మిరియాలు,అల్లం, పసుపు, కొత్తిమీర వంటి ఆహారాలను తీసుకోవాలి. మాంసాహార ప్రేమికులు భారీ మాంసాహారం కాకుండా సూప్ మరియు తేలికపాటి భోజనం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.