సోమవారం, 6 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 ఆగస్టు 2020 (16:46 IST)

అధిక బరువును తగ్గించే నారింజ పండ్లు.. రోజు వారీ డైట్‌లో చేర్చుకుంటే?

నారింజ పండ్లతో అధిక బరువును తగ్గించుకోవచ్చునని న్యూట్రీషియన్లు అంటున్నారు. అధిక బరువు కలిగివున్నవారు ఎక్సర్‌సైజ్ చేయడం, కష్టమైన వర్కవుట్స్ చేయడం మాత్రమే కాదు.. కొన్ని రకాల ఆహార పదార్థాలు కూడా మనకి అనుకున్న ఫలితాలను తీసుకొస్తుంది. అందుకే నారింజను రోజు వారీ డైట్‌లో చేర్చుకోవచ్చు. 
 
నారింజ పండ్లతో జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. ముఖ్యంగా ఆహారం తిన్న వెంటనే ఈ పండుని తినడం వల్ల తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. సాధారణంగా అధిక బరువుకి కారణం జీర్ణ సమస్యలే. కాబట్టి.. జీర్ణసమస్యలకి చెక్ పెట్టే నారింజ పండు తినడం వల్ల ఆ సమస్యలు దూరం అవుతాయి.. అధిక బరువు తగ్గుతుంది. 
 
నారింజ పండ్లల్లో ఎక్కువగా విటమిన్ ఏ ఉంటుంది. ఇది కంటి చూపుని మెరుగుపరుస్తుంది. కాబట్టి వయసు మళ్ళిన వారు దీనిని తీసుకోవచ్చు. ముందు నుంచే ఈ పండ్లని తీసుకోవడం వల్ల దృష్టి సమస్యలు చాలా వరకూ దూరం అవుతాయి. ఇతర కంటి సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. చర్మం కూడా తాజాగా మెరుస్తూ ఉంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.