గురువారం, 28 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 19 జులై 2017 (17:59 IST)

మహిళలు గుమ్మడి గింజలను నేతిలో వేయించి తీసుకుంటే?

గుమ్మడి గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. గుమ్మడి గింజల్లో పీచు, ప్రోటీన్లు, ఇనుము, విటమిన్-ఇ, మాంగనీస్, ఫాస్పరస్ వంటి పోషకాలున్నాయి. వంద గ్రాముల గుమ్మడి గింజలను తీసుకోవడం ద్వారా 600 కెలోరీలు వున్నా

గుమ్మడి గింజల్లో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. గుమ్మడి గింజల్లో పీచు, ప్రోటీన్లు, ఇనుము, విటమిన్-ఇ, మాంగనీస్, ఫాస్పరస్ వంటి పోషకాలున్నాయి. వంద గ్రాముల గుమ్మడి గింజలను తీసుకోవడం ద్వారా 600 కెలోరీలు వున్నాయి. మధుమేహం, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో గుమ్మడి గింజలు భేష్‌గా పనిచేస్తాయి. రక్తపోటును నియంత్రించి.. బరువును తగ్గిస్తుంది. 
 
గుండెను పదిలంగా వుంచేందుకు గుమ్మడి గింజలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. గుమ్మడిలో వ్యాధినిరోధక శక్తిని పెంచే పోషకాలున్నాయి. జలుబు, జ్వరం, అలసట, మానసిక ఒత్తిడి, మొటిమలు, సంతానలేమి వంటి సమస్యలను గుమ్మడి నయం చేస్తుంది. ఇందులో ఒమేగా-3 ఆమ్లాలు, ఇన్సులిన్‌ను పెంచే పోషకాలున్నాయి. తద్వారా మధుమేహం నియంత్రించబడుతుంది.
 
మహిళలు గుమ్మడి గింజలను నేతిలో వేయించి.. రోజు తీసుకుంటే నెలసరి సమస్యలు, నొప్పులు మటుమాయం అవుతాయి. గుమ్మడి గింజలను ఎండబెట్టి.. పొడి చేసుకుని..ఆ పొడిని రోజూ ఓ టీ స్పూన్ పాలలో కలుపుకుని తాగితే శరీరానికి బలం చేకూరుతుంది.