మంగళవారం, 5 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 1 జూన్ 2023 (22:51 IST)

మగవారు పచ్చి పసుపు టీ తాగితే?

Turmeric, Basil leaves Water
పచ్చి పసుపు. ఈ పచ్చి పసుపులో పసుపు పొడి కంటే ఎక్కువ ఆరోగ్య కారకాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పచ్చి పసుపులో క్యాన్సర్‌తో పోరాడే గుణాలున్నాయి, ఇది హానికరమైన రేడియేషన్‌కు గురికావడం వల్ల వచ్చే కణితుల నుండి కూడా రక్షిస్తుంది. పచ్చి పసుపు వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. పచ్చి పసుపుతో చేసిన టీ మగవారు తీసుకుంటుంటే కావలసినంత శక్తి సమకూరుతుంది. పచ్చి పసుపు ఫ్రీ రాడికల్స్‌ను తొలగిస్తుంది. కీళ్ల నొప్పులకు ఉపశమనాన్ని అందిస్తుంది.
 
పచ్చి పసుపులో ఇన్సులిన్ స్థాయిలను సమతుల్యం చేసే గుణం ఉంది కనుక షుగర్ పేషంట్లకు చాలా ఉపయోగకరం. శరీరంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే శక్తి పచ్చి పసుపులో వుంది.
సోరియాసిస్ వంటి చర్మ సంబంధిత వ్యాధులను నివారించే గుణాలు పచ్చి పసుపులో వున్నాయి.
 
గర్భిణీ స్త్రీలు పచ్చి పసుపును ఉపయోగించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. శస్త్రచికిత్స చేయించుకోబోయేవారు, అధిక మోతాదులో మందులు తీసుకునేవారు పచ్చి పసుపును తినకూడదు.