శనివారం, 25 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : శనివారం, 18 మే 2019 (19:01 IST)

చర్మ సమస్యలతో సతమతమవుతున్నారా? ఐతే రెడ్‌వైన్ బెస్ట్

సాధారణంగా మద్యం సేవించేవారిలో ఎక్కువ మంది తాగే ఆల్కహాలిక్ డ్రింక్‌లలో రెడ్‌వైన్ కూడా ఒకటి. రోజూ ఒక గ్లాసు రెడ్‌వైన్ తాగితే చర్మానికి సంరక్షణ కలుగుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. రెడ్‌వైన్ సేవించడం వల్ల మన ఆరోగ్యానికి అనేక రకాల ప్రయోజనాలు చేకూరుతాయట. వాటిలో ప్రముఖమైన వాటిని ఇప్పుడు తెలుసుకుందాం.. 
 
* రెడ్‌వైన్ తాగడం వల్ల చర్మం లోపల ఉండే మృత కణాలు తొలగిపోయి చర్మం తాజాగా మారుతుంది.
 
* రెడ్‌వైన్ ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
 
* ప్రతిరోజూ రెడ్‌వైన్ తాగితే ముఖంలో వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా రావట. చర్మం ఎప్పుడూ కాంతివంతంగా ఉంటుందట. ఎప్పుడూ యవ్వనంగా కనిపిస్తారట.
 
* మొటిమల సమస్యతో బాధపడుతున్న వారు రోజూ రెడ్‌వైన్ తాగితే మొటిమలు తగ్గుతాయని పరిశోధనల్లో తేలింది.
 
* గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే రోజూ రెడ్‌వైన్ తాగాలని సైంటిస్టులు సూచిస్తున్నారు.