సోమవారం, 6 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : గురువారం, 30 మే 2019 (18:21 IST)

పండు మిర్చిని తినండి.. బరువు తగ్గండి.. (Video)

సరైన సమయానికి భోజనం చేయకపోవడం, చిరుతిండ్లు ఎక్కువగా తినడం, శరీరానికి వ్యాయామం లేకపోవడం, పని ఒత్తిడి ఇలా చాలా కారణాల వలన మనకు అనారోగ్యం వస్తుంది. బరువు పెరిగి ఊబకాయం కూడా వచ్చే అవకాశం ఉంది. పండు మిర్చి తింటే ఆరోగ్యానికి మంచి చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
బరువు తగ్గించుకునేందుకు మరియు ఆయుష్షు పెరుగుదల కోసం పండు మిర్చిని తరచుగా తినాలని చెబుతున్నారు. 16వేల మందిపై పరిశోధనలు చేసిన సైంటిస్టులు తరుచూ పండు మిరపకాయలు తినడం వల్ల బరువు తగ్గుతారని నిర్ధారించారు. పండు మిరపకాయలు తినేవారికి గుండెజబ్బులు, పక్షవాతం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటుంది. 
 
దీనిలో ఉండే క్యాప్సెయిసిన్ అనే పదార్థం యాంటీ ఆక్సిడెంట్‌లా పనిచేసి శరీరంలోని బ్యాక్టీరియా, ఇతర క్రిములను నాశనం చేస్తుంది. దీని వలన మనిషి రోగాల బారిన పడకుండా ఉంటాడు. ఆయుష్షు కూడా పెరుగతుంది.