శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: గురువారం, 11 ఫిబ్రవరి 2021 (22:55 IST)

రక్తపోటును తగ్గించే గులాబీ పూలు, ఎలాగో తెలుసా?

కొన్ని ప్రత్యేకమైన ఆకులు ఔషధ విలువలను కలిగి వుంటాయి. ఆకులే కాదు పుష్పాల్లోనూ ఔషధ విలువలుంటాయి. కొన్ని చెట్లలోనూ ఈ విలువలు నిక్షిప్తమై వుంటాయి. మన పెరట్లో వుండే రోజా పూలలోనూ ఔషధ విలువలున్నాయి. అవేమిటో చూద్దాము.
 
బాదంపాలతో గులాబీ రేకులు కలిపి తీసుకుంటుంటే రక్తపోటు తగ్గిపోతుంది. గులాబీ రేకుల్ని కొబ్బరి నూనెతో కలిపి వేడిచేసి చల్లారిన తర్వాత తిలకంగా పెట్టు కుంటే మెదడు చల్లబడటమే కాక జ్ఞాపకశక్తి పెరుగుతుంది. గులాబీలని హృద్రోగులు ఉన్న ప్రదేశంలో ఉంచితే వాటి నుంచి వచ్చే పరిమళం రోగాన్ని ఉపశమింప చేస్తుంది.
 
గులాబీ పువ్వుల నుండి ఆవిరి ద్వారా తీయబడిన నూనె, గులాబీ అత్తరుని పరిమళ ద్రవ్యాలలో కొన్ని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. గులాబీ నూనె నుండి తయారయ్యే రోజ్ వాటర్‌ను వాడటం మనకు తెలిసిన విషయమే. గులాబీ పండ్ల నుండి తయారయ్యే గులాబీ పండు గింజ నూనెను, చర్మ మరియు సౌందర్య సంబంధ ఉత్పత్తులలో వాడుతారు.
 
ప్రతిరోజు భోజనానంతరం చాలామందికి ఒక్కపొడి వేసుకునే అలవాటు ఉంటుంది. అంతకన్నా గులాబీ రేకుల్ని నమిలితే జీర్ణప్రక్రియ సులభంగా అవుతుంది. వేసవి తాపం తీర్చుకునేందుకు కేవలం 10 గ్రాముల లోపు ద్రవాన్ని ఒక్కసారి మాత్రమే తీసుకుంటే మేలు కలుగుతుంది.