నువ్వులు.. ఖర్జూరంతో లడ్డూలు తింటే ఏంటి ఫలితం?

Sesame dates balls
సెల్వి| Last Updated: మంగళవారం, 4 ఆగస్టు 2020 (20:36 IST)
Sesame dates balls
నువ్వులు, ఖర్జూరంతో లడ్డూలు తింటే.. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. నువ్వులు, జీర్ణశక్తిని పెంచుతాయి. రక్తపోటును అదుపులో ఉంచుతాయి. కేన్సర్ నిరోధకంగా పని చేసే ఫైటిక్ యాసిడ్ - మెగ్నీషియం ఫైటో స్టెరాల్స్ కూడా నువ్వుల్లో ఎక్కువ ఉంటాయి. శరీరవ్యవస్థను నిదానింపచేసే థయామిన్ -ట్రిప్టోఫాన్ విటమిన్లు ఉంటాయి.

ఒంటినోప్పుల్ని తగ్గించి, మనసును ఉత్తేజితం చేసి గాఢ నిద్రకు దోహదం చేసే సెరొటోనిన్ కూడా నువ్వుల్లో ఎక్కువే ఉంటుంది. నువ్వులు ఎముకలను పటిష్ఠపరుస్తాయి. తద్వారా ఎముకలను గుళ్లబార్చే ఆస్టియోఫోరోసిస్ వ్యాధి రాకుండా కాపాడతాయి.

అలాగే ఖర్జూరాల్లో అధికమోతాదులలో కార్బోహైడ్రేట్‌లు ఉంటాయి. ఖర్జూరాలను తినడం వల్ల, కొలెస్ట్రాల్ తగ్గి గుండె జబ్బులు దూరం అవుతాయి. ఖర్జూరాలు రక్తపోటును నియంత్రిస్తాయి. ఎముకల పటిష్ఠతకు ఉపయోగ పడతాయి.

అలాగే ఖర్జూరాలు ఉదర సంబంధ వ్యాధులకు చెక్ పెడతాయి. అన్ని రకాల పండ్లలో కంటే,ఖర్జూరాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఈ రెండింటిని వుండల రూపంలో రోజుకొకటి తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి మేలు ఎంతో జరుగుతుంది. అనారోగ్య సమస్యలు దరిచేరవు అని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.దీనిపై మరింత చదవండి :