పగటిపూట నిద్రతో మధుమేహం తప్పదా?

sleeping
sleeping
సెల్వి| Last Updated: శుక్రవారం, 24 జులై 2020 (23:56 IST)
పగటిపూట నిద్రతో మధుమేహం తప్పదని పరిశోధనలో తేలింది. పగటి పూట నిద్రించే వారికి డయాబెటిస్, బరువు పెరగడం, తలనొప్పి, గుండె జబ్బులు, క్యాన్సర్, అర్థరైటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశముందన్నారు. కనుక రాత్రిపూట తగినంత నిద్రపోయే వారు పగటి పూట నిద్రపోవడం మానుకుంటే మేలని వారు సూచిస్తున్నారు.

రాత్రి పూట సమయానికి నిద్రించేవారిలో అనారోగ్య సమస్యలు వుండవని.. ఒబిసిటీ వేధించదని వైద్యులు చెప్తున్నారు. నైట్ షిఫ్టులు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లకు నిద్రను అంకితం చేస్తే.. ఇక అనారోగ్య సమస్యలను కూడా కొనితెచ్చుకున్నట్లేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అందుకే రాత్రి పూట 8 గంటల పాటు నిద్రించడం అలవాటు చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. రాత్రిపూట నిద్రపట్టకపోతే.. తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి. స్పైసీ ఫుడ్‌, బిర్యానీ, చీజ్, పిజ్జా, ఐస్‌ క్రీంలు తినకూడదు.

రాత్రి పూట శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. అందువల్ల మాంసాహారం లాంటివి తింటే తేలిగ్గా జీర్ణం కావు. అలాగే కాఫీలు, టీలలో ఉండే కెఫిన్‌ వల్ల నిద్ర సరిగా పట్టదు. వీటికి బదులు పాలలో తేనె కలుపుకుని తీసుకోవడం ద్వారా హాయిగా నిద్రపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.దీనిపై మరింత చదవండి :