శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Kiranbindu
Last Modified: బుధవారం, 26 ఏప్రియల్ 2017 (16:07 IST)

అతను రోజూ 4 నుంచి 5 గంటలు మాత్రమే నిద్రపోయేవారు... అందుకే అలా అయింది...

రాజన్ దాస్ చనిపోవడానికి కారణం రోజుకు తక్కువ గంటలు నిద్రపోవడం. అతను రోజూ 4 నుంచి 5 గంటలు మాత్రమే నిద్రపోయేవారు. 25 నుండి 49 వయస్సు గలవారు తక్కువ నిద్రపోయినట్లయితే అధికంగా రక్తపోటు సమస్యలు రావచ్చు, అలాగే ప్రతిఒక్కరూ రోజూ 5 గంటల కన్నా తక్కువ నిద్రపోయినట

CEOగా పనిచేసే 42 ఏళ్ల రాజన్ దాస్ 2009లో గుండెపోటుతో మరణించారు. అతను తన ఉద్యోగంలో, క్రీడలలో చాలా ఉత్సాహంగా ఉండేవారు. అలాగే ప్రతిరోజూ వ్యాయామం చేసేవారు. కానీ రాజన్ దాస్‌ ఎందుకు చనిపోయారు, కారణం ఏమిటి?
 
రాజన్ దాస్ చనిపోవడానికి కారణం రోజుకు తక్కువ గంటలు నిద్రపోవడం. అతను రోజూ 4 నుంచి 5 గంటలు మాత్రమే నిద్రపోయేవారు. 25 నుండి 49 వయస్సు గలవారు తక్కువ నిద్రపోయినట్లయితే అధికంగా రక్తపోటు సమస్యలు రావచ్చు, అలాగే ప్రతిఒక్కరూ రోజూ 5 గంటల కన్నా తక్కువ నిద్రపోయినట్లయితే గుండెపోటు సమస్యలు రావచ్చు. రోజూ 5 గంటలు నిద్రపోతే 39% గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, అలాగే రోజుకు 6 గంటలు నిద్రపోతే 8% గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
 
రాజన్ జీవితంలో ఎటువంటి ఒత్తిడులు లేకపోయినా, అన్నీ పాటించినా, అతను తక్కువ నిద్రపోవడం వలన మరణించాడు. కనుక ఎటువంటి సమస్యలు లేకపోయినా తక్కువ నిద్రపోవడం అనేది నిప్పుతో చెలగాటం ఆడినట్లే. వైద్యులు చెప్పినట్లుగా, ఆరోగ్యంగా ఎక్కువ రోజులు జీవించడానికి రోజుకు 7 గంటలు నిద్రపోవాలి. కనుక ఎవ్వరూ 7 గంటలు కన్నా తక్కువగా మీ అలారమును సెట్ చేయకండి.