గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chj
Last Modified: గురువారం, 15 జూన్ 2017 (20:23 IST)

నిద్రలేమి... పురుషుల్లో శృంగారం పట్ల ఆసక్తిని తగ్గిస్తుందా?

నిద్రలేమి పురుషుల్లో శృంగారం పట్ల ఆసక్తిని తగ్గిస్తున్నట్టు లండన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. "నిర్ణీత కాలం నిద్రే" మీ శృంగార సామర్థ్యానికి రక్షగా పనిచేస్తుందని పరిశోధకులు చెపుతున్నారు. తక్కువ సమయం నిద్ర పోయేవారిలో టెస్టోస్టీరాన్‌ హార్మోన్‌ త

నిద్రలేమి పురుషుల్లో శృంగారం పట్ల ఆసక్తిని తగ్గిస్తున్నట్టు లండన్ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. "నిర్ణీత కాలం నిద్రే" మీ శృంగార సామర్థ్యానికి రక్షగా పనిచేస్తుందని పరిశోధకులు చెపుతున్నారు. తక్కువ సమయం నిద్ర పోయేవారిలో టెస్టోస్టీరాన్‌ హార్మోన్‌ తక్కువగా ఉత్పత్తి అవుతోందని, ఇది పురుషుల్లో సెక్స్‌ పట్ల ఆసక్తి తగ్గిస్తున్నట్టు వారి పరిశోధనల్లో తేలింది. అంతేకాక ఈ హార్మోన్‌ తగ్గిపోవటం వల్ల ఇతర దుష్ప్రభావాలు కలుగుతాయని పరిశోధకులు వెల్లడించారు. 
 
ముఖ్యంగా యువకుల్లో కండరాల క్షీణత, ఎముకల సాంద్రత తగ్గిపోవటం, ఏకాగ్రత లోపించటం వంటి అనారోగ్యాలు కలుగుతాయని తెలిపారు. తమ అధ్యయనం కోసం 10 మంది ఆరోగ్యవంతులను విభిన్న పరీక్షలకు గురిచేసి వారు నిద్రపోయే సమయాన్ని, వారి సెక్స్‌ పట్ల ఆసక్తులను పరిశీలించారు. 
 
వారికి ప్రయోగశాలలో రోజుకు 10 గంటల చొప్పున మూడు రాత్రులు, తర్వాతి 8 రాత్రుల్లో రోజుకు 5 గంటల నిద్రపోనిచ్చారు. 10 గంటల నిద్ర చివరి రోజు, అదేవిధంగా 5 గంటల నిద్ర చివరి రోజు, ప్రతీ 15, 30 నిమిషాలకు ఒకసారీ వారి రక్త నమూనాలను పరీక్షించారు. అంతేకాక వారికి కలిగిన భావాలను కూడా పరిగణలోనికి తీసుకున్నారు. 
 
వారంలో రాత్రి రోజుకు ఐదు గంటల కంటే తక్కువగా నిద్ర పోయేవారిని, అంతకంటే ఎక్కువ సమయం నిద్ర పోయే వారితో పోలిస్తే... తక్కువ సమయం నిద్రపోయే వారిలో టెస్టోస్టీరాన్‌ స్థాయి 10 నుంచి 15 శాతం తగ్గుతున్నట్టు కనుగొన్నట్టు తెలిపారు. 
 
తక్కువ సమయం నిద్ర, ఎండోక్రైన్‌ గ్రంథి తీరును కూడా తీవ్రంగా ఆటంకపరుస్తుందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్‌ ఈవ్‌‌వాన్‌ కాటెర్‌ అన్నారు. తమ పరిశోధన ఈ రంగంలో కొత్త భావనలకు నాంది పలుకుతుందని పరిశోధకులు అంటున్నారు.