బుధవారం, 25 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 30 మార్చి 2020 (17:59 IST)

నానబెట్టిన బాదం పప్పుల్ని రోజూ తీసుకుంటే..?

నానబెట్టిన బాదం పప్పుల్ని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. బాదంపప్పుపై ఉండే పొట్టులో ఒకరకమైన బయో మాలిక్యూల్ టానిన్ ఉంటుంది. ఇది జీర్ణక్రియపై ప్రభావం చూపుతుంది. 
 
అదే కనుక, బాదం పప్పును నానబెడితే వాటిపై పొట్టు ఊడిపోతుంది.  ఒక గుప్పెడు బాదం పప్పును, అరకప్పు నీటిలో సుమారు ఎనిమిది గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత నీటిని తీసేసి, బాదంపప్పుపై పొట్టును తొలగించాలి. 
 
వీటిని రోజూ పరగడుపున లేదంటే.. అల్పాహారానికి అరగంట ముందు తీసుకోవడం ద్వారా క్యాన్సర్ ముప్పును తొలగించుకోవచ్చు. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుకోవచ్చు. అధిక బరువుకు చెక్ పెట్టవచ్చు. నానబెట్టిన బాదంలో ఉండే ఫోలిక్ యాసిడ్ పుట్టుకతో వచ్చిన లోపాలను దూరం చేస్తుంది. ముఖ్యంగా గర్భిణీ మహిళలకు బాదం పప్పులు ఎంతో మేలు చేస్తాయి. 
 
పిల్లలకు బాదం పప్పుతో చేసిన పొడిని పాలలో కలిపి ఇవ్వడం ద్వారా వారి శరీరానికి కావలసిన యాంటీ యాక్సిడెంట్లు లభిస్తాయి. డయాబెటిస్ పేషెంట్లకు కూడా నానబెట్టిన బాదం పప్పులు శరీరంలో గ్లూకోజ్ స్థాయిని క్రమబద్ధీకరించేందుకు ఉపయోగపడతాయని వైద్యులు సూచిస్తున్నారు.