శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 19 జనవరి 2017 (20:04 IST)

శీతాకాలంలో సూప్స్ తీసుకోండి.. సూప్‌లలో నట్స్.. పప్పులు చేర్చుకుంటే?

శీతాకాలంలో సూప్స్ తీసుకుంటే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఇవి శరీరం ఇన్‌‌ఫెక్షన్లతో పోరాడుతాయి. ఈ చల్లటి వాతావరణంలో శరీరానికి తగిన వేడి అందుతుంది. ఒక బౌల్‌ సూప్‌ తీసుకున్నప్పుడు కడుపు నిండినట్లవవుతుంది

శీతాకాలంలో సూప్స్ తీసుకుంటే ఆహారం సులభంగా జీర్ణమవుతుంది. ఇవి శరీరం ఇన్‌‌ఫెక్షన్లతో పోరాడుతాయి. ఈ చల్లటి వాతావరణంలో శరీరానికి తగిన వేడి అందుతుంది. ఒక బౌల్‌ సూప్‌ తీసుకున్నప్పుడు కడుపు నిండినట్లవవుతుంది. దీన్ని తాగడానికి నోట్లోకి తీసుకోవడం, రుచి, వాసనను ఆస్వాదిస్తూ మింగడం వంటివన్నీ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇలా చేయడం వల్ల త్వరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. తక్కువ కెలోరీలతో ఎక్కువ ఎనర్జీ పొందినవారవుతారు.
 
వీటిని భోజనానికి ముందు తీసుకుంటే చాలా మంచిది. క్యాప్సికం, బ్రొకోలి, ఉల్లికాడలు, క్యారెట్స్ లాంటి వాటితో సూప్‌లు తయారు చేస్తే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా అందుతాయి. 
 
చికెన్‌, ఫిష్‌ లేదా ప్రాన్స్ సూప్స్ లలో ప్రోటీన్లు అధికం. అంతేకాదు, ఈ కాలంలో శరీరానికి తగిన వేడిని ఇస్తాయి. అంతేకాదు, సూప్‌లో అదనంగా ప్రోటీన్లు పెంచడానికి పప్పులు, నట్స్ చేర్చుకుంటే మంచిది. ఇష్టపడేవారు గుడ్డులోని తెల్లసొనను కలుపుకోవచ్చు.  సూప్‌లలో ఉప్పు తక్కువగా వాడతాం. దీనివల్ల పొటాషియం అధికంగా ఉండి రక్తపోటును నియంత్రిస్తుంది. శరీరంలో నీటి సమతుల్యాన్ని పరిరక్షిస్తుంది. ఇవి శరీరం మరింత తేలిగ్గా, శక్తివంతంగా ఉండేందుకు సహకరిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.