గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By pnr
Last Updated : మంగళవారం, 28 జూన్ 2016 (10:09 IST)

వ్యాయామం కోసం జిమ్‌కు వెళుతున్నారా.. అయితే, రోగాలు ఖాయం?

మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. దీంతో వయసుకు మించి బరువుతో బాధపడుతున్నారు. ఈ బరువును తగ్గించుకునేందుకు వ్యాయామాల చుట్టూ తిరుగుతుంటారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. దీంతో వయసుకు మించి బరువుతో బాధపడుతున్నారు. ఈ బరువును తగ్గించుకునేందుకు వ్యాయామాల చుట్టూ తిరుగుతుంటారు. కొంతమంది యువత అయితే, సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ అంటూ జిమ్‌లలో గంటల కొద్దీ గడుపుతుంటారు. అయితే, వ్యాయామాల కోసం, సిక్స్ ప్యాక్‌ల కోసం జిమ్‌లకు వెళితే అనేక రోగాలు కొని తెచ్చుకున్నట్టేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
 
ఎందుకుంటే... ఏసీ సౌకర్యంతో ఉండే జిమ్‌లో వాడే పరికరాలపై హానికారక బ్యాక్టీరియా అధికంగా ఉంటుందట. ముఖ్యంగా, జిమ్‌లలో ఉండ ట్రెడ్‌ మిల్‌పై 60 నుంచి 75 శాతం బ్యాక్టీరియా నిల్వ ఉంటుందట. అదేవిధంగా వెయిట్స్‌, బైక్స్‌ ఇలా ఇతర పరికరాలపై గ్రామ్‌ పాజిటివ్‌ కొస్సీ, బసిల్లస్‌ వంటి హానికరమైన బ్యాక్టీరియా ఉన్నట్లు ఈ అధ్యయనాల్లో వెల్లడైంది. 
 
అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే జిమ్‌కు వెళ్లేవారంతా అక్కడ ఉండే ఒకే పరికంతోనే వ్యాయామాలు చేస్తుంటారు. దాని వల్ల ఆ పరికరం అశుభ్రం అవుతుంది. ఆ పరికరాలను నెలలు తరబడి శుభ్రం చేయరు. దాంతో వాటిపై హానికరమైన బ్యాక్టీరియా ఏర్పడి వివిధ రకాల అనారోగ్య సమస్యలతో పాటు వ్యాధులు కలుగజేస్తాయి.. అలాగే, బ్యాక్టీరియా వల్ల చర్మవ్యాధులు, కళ్ళు, ముక్కు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు కలుగుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.