సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్ కుమార్
Last Updated : గురువారం, 22 ఆగస్టు 2019 (17:21 IST)

ఎర్రని స్ట్రాబెర్రీలు బరువును ఇట్టే తగ్గిస్తాయట..!

చూడటానికి ఎర్రగా ఉండే స్ట్రాబెర్రీ పండ్లలో పోషకాలు అనేకం ఉన్నాయి. వీటిని పిల్లలు, పెద్దలు ఇష్టంగా తింటారు. దీని వలన చాలా ప్రయోజనాలు ఉన్నాయి.


స్ట్రాబెర్రీలో ఉండే రుచి, పోషక విలువల కారణంగా ఈ పండ్లను జామ్‌లు, స్మూతీలు, మిల్క్ షేక్స్, ఐస్ క్రీములు, సౌందర్య సాధనాల్లో విరివిగా ఉపయోగిస్తారు. స్ట్రాబెర్రీలను తరచుగా తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. 
 
పొటాషియం, విటమిన్ కే మరియు మెగ్నీషియం కలిసి ఉండటం వలన ఎముకల పటిష్టతకు స్ట్రాబెర్రీస్ బాగా ఉపయోగపడతాయి. స్ట్రాబెర్రీలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు స్ట్రాబెర్రీలను తరచుగా తినవచ్చు. ఇది పొట్టు చుట్టూ ఉండే క్రోవ్వును కరిగిస్తుంది. వీటిని తినడం వలన హై క్యాలరీ ఫుడ్ పట్ల ఆసక్తి తగ్గుతుంది. తద్వారా ఆహారం మితంగా తీసుకుంటారు. 
 
బరువు తగ్గే అవకాశం ఉంటుంది. 100 గ్రాముల స్ట్రాబెర్రీలలో కేవలం 33 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. కాబట్టి అధిక కేలరీలు ఉంటాయనే భయం లేకుండా వీటిని రోజూ తినవచ్చు. వీటిని తింటే జీర్ణ సమస్యలు తగ్గుతాయి. అజీర్ణం, గ్యాస్, మలబద్దకం, అసిడిటీ తదితర సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. శరీరంలోని వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. 
 
బరువును నియంత్రించే హార్మోన్ల పనితీరును క్రమబద్ధీకరించే ఎల్లాజిక్ యాసిడ్ స్ట్రాబెర్రీలలో పుష్కలంగా ఉంటుంది. అందువల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. స్ట్రాబెర్రీలలో ఆంథోసయనిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి అడిపోనెక్టిన్ అనబడే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ హార్మోన్ మన శరీర మెటబాలిజాన్ని నియంత్రిస్తుంది. ఇది బరువు తగ్గేందుకు పనిచేస్తుంది.