గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 22 జులై 2017 (16:45 IST)

30 ఏళ్లకే 60 ఏళ్ల వారిలా ఎందుకు కనిపిస్తారు..?

చిన్న చిన్న సమస్యలకే ఒత్తిడికి లోనవుతున్నారా? భావోద్వేగానికి గురై... ఇతరులపై ఆవేశం వెల్లగక్కుతున్నారా? అయితే ఈ స్టోరీ మీరు చదవాల్సిందే. సమస్యలనేవి అందరికీ ఉంటాయని గమనించి.. పరిష్కారమార్గం ఎంచుకోండి. త

చిన్న చిన్న సమస్యలకే ఒత్తిడికి లోనవుతున్నారా? భావోద్వేగానికి గురై... ఇతరులపై ఆవేశం వెల్లగక్కుతున్నారా? అయితే ఈ స్టోరీ మీరు చదవాల్సిందే. సమస్యలనేవి అందరికీ ఉంటాయని గమనించి.. పరిష్కారమార్గం ఎంచుకోండి. తీవ్రంగా సమస్యల గురించి ఆలోచించి.. అనారోగ్యాలను కొని తెచ్చుకోవద్దని సైకాలజిస్టులు సూచిస్తున్నారు. 
 
అంతేగాకుండా సానుకూల దృక్పథం, ఆశావాదాలను పెంచుకోవడంతోపాటు సమస్యలను తేలికగా తీసుకుంటే చాలు.. ఒత్తిడి కారణంగా ఏర్పడే గుండెపోటు తగ్గుతుంది. తద్వారా నిత్యయవ్వనులుగా కనిపిస్తారు. భవిష్యత్తు గురించి మరీ ఎక్కువగా చింతించడం చేస్తే 30 ఏళ్లకే 60 ఏళ్ల వారిగా కనిపిస్తారు. 
 
మెదడులోని భావోద్వేగానికి మానసిక ఆరోగ్యానికి లింకుదని గమనించాలి. సమస్యలను నెత్తినేసుకోకుండా ఓస్ ఇంతేనా అని తీసిపారేస్తే... ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. అంతేకాదు.. సానుకూల అంశాలపై దృష్టిపెడితే వయసు మళ్లినా చురుకుగా ఉండొచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. తీవ్ర ఒత్తిడి కారణంగానే బీపీ, మధుమేహం, హైబీపీ వంటి వ్యాధులు అధికమవుతున్నాయని వారు హెచ్చరిస్తున్నారు.