ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 1 ఫిబ్రవరి 2020 (18:13 IST)

పిల్లలు వద్దనుకునేవారు ప్రతిరోజూ అవి వేసుకోవాలంటే ఇబ్బందే... అందుకనీ..

కెరీర్, ఇతర కారణాలతో ఇప్పుడే పిల్లలు వద్దనుకునే జంటలు చాలా వుంటుంటాయి. పిల్లలు వద్దనుకునేవారు ఎంచుకునే మార్గం గర్భ నిరోధక మాత్రలు. ఐతే వీటిని రోజూ వేసుకోవాలంటే స్త్రీలకు ఇబ్బందిగా వుంటుంది. ఐతే ఏమీ చేయలేక ఆ మాత్రలు మింగుతూ వుంటారు మరి.
 
ఐతే ఇలాంటి వారికి భవిష్యత్తులో ఓ మంచి మార్గం దొరుకుతోంది. అదేంటంటే... ఇకపై నెలకు ఒకే ఒక్క మాత్రను వేసుకుంటే నెల రోజులపాటు అది పనిచేస్తుంది. గర్భం రాకుండా అడ్డుకుంటుంది. 
 
మసాచు సెట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు గర్భ నిరోధకంగా పనిచేసే ఈ ప్రత్యేకమైన మాత్రను తయారు చేస్తున్నారు. ఇది నెలకొకటి వేసుకుంటే సరిపోతుంది. నాలుగు వారాల పాట గర్భనిరోధకంగా పనిచేస్తుంది. మాత్ర వేసుకున్న తర్వాత దాని ప్రభావం నెల రోజుల పాటు అలాగే వుంటుందట.