వేసవిలో మినుములు, పెసలు, బియ్యంతో ఫేస్ ప్యాక్ ఇలా?

మంగళవారం, 13 మార్చి 2018 (15:37 IST)

వేసవిలో చర్మ సమస్యలను దూరం చేసుకోవాలంటే మినుములు, పెసలు, బియ్యాన్ని ఉపయోగించుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మినుములు, పెసళ్లు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇంకా శరీర ఉష్ణాన్ని తగ్గిస్తాయి. పెసళ్లలో ఇనుము, ధాతువులు పుష్కలంగా వుంటాయి. అలాగే బియ్యం కూడా శరీర వేడిని తగ్గిస్తాయి. ఈ మూడింటిని సమపాళ్లు తీసుకుని పౌడర్‌లా తయారు చేసి.. ముఖానికి, చర్మానికి రోజు మార్చి రోజు ప్యాక్‌లా వేసుకుంటే చర్మంపై మొటిమలు మాయమవుతాయి. అలాగే చెమటకాయలు దూరమవుతాయి. 
 
అలాగే బియ్యంతో చేసిన జావ వేసవిలో శరీర వేడిని తగ్గిస్తుంది. బియ్యం ఒక కప్పు, బెల్లం అర కప్పు, పెసలు పావు కప్పు, ఏలకులు రెండు, పాలు గ్లాసుడు తీసుకుని జావగా ఎలా చేయాలో చూద్దాం. బియ్యాన్ని కడాయిలో వేయించుకుని.. రవ్వలా మిక్సీలో కొట్టి పక్కనబెట్టుకోవాలి. 
 
ఓ పాత్రలో బెల్లాన్ని తీసుకుని నీటిని చేర్చి కరిగించాలి. అందులో ఉడికించిన పెసలు పప్పు, రవ్వలా చేసుకున్న బియ్యం చేర్చాలి. యాలకులు కూడా చేర్చాలి. బియ్యం ఉడికేంత వరు వుంచి దించేయాలి. ఈ గంజిని వేసవిలో రోజూ తీసుకుంటే.. వేడి తగ్గిపోతుంది. పిల్లలు, పెద్దలకు ఈ గంజి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

విటమిన్ సి అందకపోతే ఏమవుతుందో తెలుసా?

విటమిన్లు శరీరానికి కావలసిన మోతాదులో అందకపోతే అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయి. విటమిసిన్ ...

news

చేపనూనెతో తేనెను కలుపుకుని తీసుకుంటే?

చేపనూనెతో తేనెను కలుపుకుని తీసుకుంటే.. చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని ఆయుర్వేద ...

news

అధిక బరువును ఎలా తగ్గించుకోవచ్చో తెలుసా?

ప్రస్తుత కాలంలో ఎక్కువుగా ఉన్న సమస్య అధిక బరువు. ఈ అధిక బరువు సమస్య వల్ల అనేక రకాలైన ...

news

వేసవిలో కీరదోసకాయను రోజూ తినండి.. లేకుంటే?

వేసవి కాలం వచ్చేసింది.. ఎండలు మార్చిలోనే మండిపోతున్నాయి. వేసవిలో వడదెబ్బ తగలకుండా ...