శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 25 ఫిబ్రవరి 2017 (14:03 IST)

వేసవి వచ్చేస్తుంది.. కూల్‌డ్రింక్స్ వద్దే వద్దు.. మజ్జిగే ముద్దు..

వేసవి వచ్చేస్తుంది. దాహంగా ఉందని కూల్ డ్రింక్స్ తాగొద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దాహంగా అనిపించినప్పుడు కొందరు మంచినీళ్లకు బదులు శీతలపానీయాల్నే గడగడా తాగేస్తుంటారు. అయితే అది హాయిగా అనిపించినా భవి

వేసవి వచ్చేస్తుంది. దాహంగా ఉందని కూల్ డ్రింక్స్ తాగొద్దు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దాహంగా అనిపించినప్పుడు కొందరు మంచినీళ్లకు బదులు శీతలపానీయాల్నే గడగడా తాగేస్తుంటారు. అయితే అది హాయిగా అనిపించినా భవిష్యత్తులో మధుమేహానికి దారితీస్తాయి. అలాగే అప్పుడప్పుడూ చక్కెర కలిపిన పండ్లరసాలను తాగేస్తుంటాం.. దానివల్ల పీచు అందకపోగా..జీవక్రియల పనితీరు దెబ్బ తింటుంది. 
 
వేసవిలో శీతలపానీయాలకు బదులు కొబ్బరినీళ్లూ లేదా మజ్జిగను ఎంచుకోవచ్చు. అలాగే పండ్లరసాలకు బదులు తాజాపండ్లనే ఎంచుకోవాలి. పీచూ అందుతుంది. ఆరోగ్యానికీ మంచిది. ఇక కాఫీ, టీలు కడుపులో పడితే కానీ కొందరు ఏ పనీ చేయలేరు. అయితే వీటిని మితిమీరి తీసుకుంటుంటే మాత్రం తగ్గించడం మంచిది. వాటిల్లో ఉండే కెఫీన్‌తోనూ బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. 
 
ఒక కప్పు కాఫీ తాగినా.. మిగిలిన సమయాల్లో గ్రీన్‌ లేదా బ్లాక్‌టీని ఎంచుకోవచ్చు. బరువు కూడా తగ్గుతారు. వేసవిలో మజ్జిగ అధికంగా తీసుకోవాలి. నీటిని సేవిస్తూ ఉండాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు.