1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Raju
Last Updated :హైదరాబాద్ , గురువారం, 30 మార్చి 2017 (08:30 IST)

మార్చిలోనే మండుతున్న ఎండలు. ఇంట్లో కర్బూజ స్టాక్ తప్పనిసరి

బుధవారం మహారాష్ట్రలోని బిహ్రా ప్రాంతంలో 46 డిగ్రీల వేడి నమోదయిందంటే ఈ వేసవి జనాలను ఎలా మాడ్చునుందో ఊహించవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎండనుంచి, దాహం నుంచి ఉపశమనం కలిగించే రెండు అద్భుత పదార్థాలను

మార్చినెల ఇంకా ముగియలేదు. అప్పుడే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశమంతా ఎండలు మండుతున్నాయి. బుధవారం మహారాష్ట్రలోని బిహ్రా ప్రాంతంలో 46 డిగ్రీల వేడి నమోదయిందంటే ఈ వేసవి జనాలను ఎలా మాడ్చునుందో ఊహించవచ్చు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఎండనుంచి, దాహం నుంచి ఉపశమనం కలిగించే  రెండు అద్భుత పదార్థాలను ప్రతి ఇంట్లోనూ స్టాక్ పెట్టుకోవలసిన అవసరం వచ్చిపడింది. అవి. కర్బూజ, మజ్జిగ
 
వేసవి సీజన్ మొత్తంలో శరీరంలో నీటి శాతాన్ని పెంచే పండ్లలో కర్బూజదే అగ్రస్థానం. నూటికి 92 శాతం నీరుండి దాహాన్ని తీర్చే అద్భుతమైన పళ్లలో కర్జూజదే అగ్రతాంబూలం. ఇంట్లో ఉన్నప్పుడూ, బయట ప్రయాణిస్తున్నప్పుడు కూడా కర్జూజను తినడం శరీరాన్ని ఉష్ణతాపం నుంచి కాపాడుతుంది. 
 
అందుకే ోడ్డుమీద వెళుతున్నప్పుడు ఎక్కడ కర్బూజ బండి కనపడినా ఆగి ముక్కలు తీసుకుని తినడం రోజూ అలవాటు చేసుకోండి. మండే ఎండల్లో శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకూడదంటే తప్పకుండా ఈ సీజన్ పొడవునా కర్బుజను తీసుకోవలసిందే. దాహాన్ని తీర్చడం, వేడిని తగ్గించడం కర్బూజ సాధారణ లక్షణాలు కాగా అధిక రక్తపోటును నియంత్రించడంలో దీని పాత్ర అమోఘం. మూత్రపిండాల్లో రాళ్లను  పొగొట్టే గుణం కూడా దీనికి ఉంది. విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి అధికంగా ఉండే కర్జూజ వేసవికాలంలో ప్రతి మనిషికీ ఆవసరమైన ప్రాణాధార పండు.