Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వ్యాధులకు దూరంగా ఉండాలంటే.. ఉదయం - సాయంత్రం వేళల్లో ఎండలో కూర్చోండి!

ఆదివారం, 9 ఏప్రియల్ 2017 (16:50 IST)

Widgets Magazine
sun light

ప్రాణి మనుగడకు సూర్యరశ్మి ఎంతో అవసరం. మూడు నెలల పాటు సూర్యుడు సెలవు పెడితే భూమిపై ఒక్క ప్రాణీ బతికి ఉండదు. భానుడి అవసరం అంతగా ఉంది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే, శరీరంలో కొన్ని రకాల జీవ క్రియలు చక్కగా సాగిపోవాలంటే సూర్యుడి కిరణాలు మన శరీరాన్ని తాకాలి. సూర్యుడి కిరణ శక్తి మనలోని ప్రతీ కణానికి అందాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. విటమిన్ డి సరిపడా ఉత్పత్తి అప్పుడే అవుతుంది. దాంతో ఎన్నో వ్యాధులు దూరంగా ఉంటాయి. తరచూ అనారోగ్యానికి గురికావడం ఆగిపోతుంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా ఒక్కటే. 
 
ప్రతి రోజూ ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట సూర్యుని కిరణాలు నేరుగా వంటిపై పడేలా చూసుకుంటే చాలు. ఇలా చేయడం వల్ల 90 శాతం మేరకు వ్యాధులు దరిచేరవట. అయితే, ఇలా ఎండలో కూర్చునే ముందుగా చర్మానికి కొబ్బరి నూనె రాసుకోవాలి. దీంతో సూర్యుని కిరణాలు మన శరీరంలోని ప్రతీ కణాన్ని చేరతాయి. దీనివల్ల కణాలు చైతన్యవంతం అవుతాయి. దాంతో వ్యాధులు నశిస్తాయి. 
 
సూర్యుని కిరణాలు ప్రతీ కణానికి చేరడం వల్ల కణాలు ఆరోగ్యంగా వృద్ధి చెందుతాయి. అయితే, వ్యాధి బారిన పడిన కణాలను ఇవి చేరలేవు. అందుకే వైద్యులు తమ పరిశోధనలో భాగంగా వ్యాధి బారిన పడిన కణాలకు సూర్యుని శక్తిని అందించే ఓ చిన్న పరికరాన్ని కనుగొన్నారు. ఉదాహరణకు హార్ట్ ఎటాక్ వచ్చిన వ్యక్తి గుండె ప్రాంతంలో పెట్టినట్టయితే ఆ పరికరం నుంచి సూర్యుని కిరణ శక్తి వ్యాధి బారిన పడిన కణాలకు చేరుతుంది. దాంతో సమస్య నయమవుతున్నట్టు గుర్తించారు. అందుకే సూర్యుని కిరణాలు వ్యాధుల బారి నుంచి రక్షణ కల్పించేవిగా పేర్కొంటారు. 
 
అయితే ఉదయం సాయంత్రం వేళల్లోనే ఎందురు కూర్చోవాలన్న ప్రశ్న ఉదయించవచ్చు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏ సమయంలో ఎండలో ఉన్నా సూర్యరశ్మిని పొందవచ్చు. కాకపోతే నేరుగా శరీరానికి తాకేలా చూసుకోవాలి. అంటే వంటి నిండా వస్త్రాలు కప్పుకుని ఎండలో ఉంటే ప్రయోజనం ఉండదని అర్థం. అలాగే సన్ స్క్రీన్ లోషన్లు రాసుకున్నా, సూర్యుని కిరణాలను చర్మం గ్రహించలేదు. సూర్యుని కిరణాలు చర్మాన్ని నేరుగా తాకినప్పుడే విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. సూర్యుని కిరణాలకు చర్మం చురుక్కుమనాలి. కనీసం 40 నిమిషాలు ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

మహిళ నడకతోనే ఆమె శృంగార శక్తి ఎంతటిదో చెప్పొచ్చట...

పరిశోధకులు ఎప్పటికప్పుడు మానవులలో వున్న అన్ని కోణాలపై అధ్యయనం చేస్తూ వుంటారు. మహిళల నడకను ...

news

వామ్మో... రాత్రిపూట నిమ్మకాయ, ఉసిరికాయ పచ్చళ్లు తినకూడదా...?

కొన్ని రకాల వ్యాధులు వచ్చినప్పుడు పథ్యం తప్పనిసరి అని చెపుతారు వైద్యులు. పథ్యమంటే ...

news

బరువు తగ్గాలా.. పొట్టనిండేలా కాయగూరలు, పండ్లు తినండి

బరువు తగ్గాలా? వీలైనంతవరకు ఎక్కువగా కాయగూరలు తినండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాయగూరలు ...

news

వేసవిలో క్యాలీఫ్లవర్ తీసుకోండి.. ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోండి

నట్స్ తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన వేడి తగ్గకుండా ఉంటుంది. రోగనిరోధక శక్తి ...

Widgets Magazine