Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అరటికాయ తింటే.. బరువు తగ్గుతారు..

శనివారం, 15 జులై 2017 (17:36 IST)

Widgets Magazine

అరటిపండు తింటే లావైపోతారని చాలామంది అనుకుంటుంటారు. అయితే పచ్చిఅరటితో బరువును తగ్గించుకోవచ్చు. అరటికాయలోని విటమిన్ బి-6, శరీరంలో పేరుకున్న కొవ్వుని కరిగించి, అధిక బరువును నియంత్రిస్తుంది. దీంతో పాటు ఇందులో ఉండే మినరల్స్ జీర్ణప్రక్రియను సులభతరం చేసి, నీరసం, బద్ధకం వంటి లక్షణాల నుంచి బయటపడేస్తుంది. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ప్రొబియాటిక్ బ్యాక్టీరియా ఇన్సులిన్ లెవల్స్‌ను క్రమబద్ధీకరిస్తుంది. ఫాట్‌గా మార్చే కార్బొహైడ్రేడ్లను నశింపజేస్తుంది. అరటికాయలో పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, అమినో యాసిడ్స్ పుష్కలం. విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. 
 
తాజా కూరగాయల్లో ఒకటైన అరటికాయతో పాటు బాదం పప్పు, విటమిన్ 'సి' జాతికి చెందిన తాజా పండ్లు, శెనగలు, గ్రీన్ టీ, డార్క్ చాక్లెట్ వంటివి కూడా శరీరంలోని అధిక బరువును నియంత్రించి ఎల్లప్పుడూ ఫిట్‌గా ఉండేందుకు సహకరిస్తాయి. 
 
ఇక శరీర బరువును నియంత్రించి, చెడు కొవ్వును తగ్గించడంలో క్యాలీఫ్లవర్, క్యాబేజీ కీలకపాత్రను పోషిస్తాయి. మాంసాహారం, చిక్కుడు జాతికి చెందిన ఆహార పదార్థాలతో పోలిస్తే క్యాబేజీ, క్యాలీఫ్లవర్‌లో ప్రొటీన్ల శాతం ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలోని కొవ్వును కరిగించడంలో సహకరిస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

రోజూ 10-12 బాదం పప్పుల్ని నానబెట్టి తింటే వీర్యం...?

నానబెట్టిన బాదం పప్పులను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. నరాలను ...

news

బొప్పాయి ఆకులను మెత్తగా నూరి అక్కడ కడితే...?

* బొప్పాయి పండు. దీనిని చూడగానే తినాలనే కోరిక వస్తుంది. ఈ పండు పసుపు రంగులో అందంగా ...

news

ఆకుకూరల్ని కుక్కర్లో మూతపెట్టి వండుతున్నారా?

రోజూ ఓ కప్పు మోతాదులో ఆకుకూర వంటకాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి కావాల్సిన పోషకాలు ...

news

అల్పాహారం కడుపు నిండా తింటే ఆరోగ్యానికి ఢోకా ఉండదట..

అల్పాహారం కడుపు నిండా తినేవారికి అనారోగ్య సమస్యలు తలెత్తవని ఆరోగ్య నిపుణులు ...

Widgets Magazine