Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రుచిగా వుండే మినరల్ వాటర్ తాగుతున్నారా? కాస్త ఆగండి..

శుక్రవారం, 19 మే 2017 (11:34 IST)

Widgets Magazine

బోర్‌వెల్ నుంచి వచ్చే వాటర్ తాగకుండా.. మినరల్ వాటర్ ఎక్కువగా తాగుతున్నారా? ఈ నీటిలోని మినరల్స్‌ను ఆర్వో వాటర్ కంపెనీలు జీరో చేసేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం తాగునీటిలో 100 పీపీఎం ఉండాలి. కానీ మనకు బయట దొరికే వాటర్ బాటిళ్లలో పది నుంచి ఇరవై పీపీఎం మాత్రమే ఉంటోంది. ఇలాంటి నీళ్లు ఆరోగ్యానికి హానికరమని.. ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. 
 
నిబంధనలకు విరుద్ధంగా శుద్ధిచేసిన నీటిని తాగితే.. కడుపులో ఎసిడిటీ, ఉబ్బరం.. ఇతర జబ్బులు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సంస్థలు నీళ్లను కూడా ఫిల్టర్ చేసేందుకు అందులో పొటాషియం కలుపుతున్నాయి. ఈ నీళ్లు రుచిగా వుంటాయి. అయితే జబ్బులు మాత్రం తప్పవు. 
 
అలాగే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌లో నీటిని సేవించడం ద్వారా క్యాన్సర్ తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చాలా రకాల వాటర్ బాటిల్స్ పెట్ (పాలిథ్లిన్ టెరెఫ్తట్లేట్)‌తో  తయారవుతున్నాయి. ఈ పెట్ క్యాన్సర్‌కు కారకమవుతుంది. ఈ బాటిల్స్‌ను ఎండలో వుంచితే రసాయనాలు కరిగి నీటిలో కలుస్తాయి. ఆ నీటిని సేవించడం ద్వారా అనారోగ్య సమస్యలు తప్పవు. 
 
అంతేకాకుండా ఆఫీసుల్లో వాడే కూలర్ బాటిల్స్‌‌, వాటర్ ఫిల్టర్లలో ఉండే బీపీఏ (బిస్పెనాల్-ఎ) కారణంగా ప్రోస్టేట్ క్యాన్సర్, బ్రెస్ట్, ఓవరీన్, లివర్ క్యాన్సర్ తప్పవని.. వీటితో పాటు మెదడు సంబంధిత వ్యాధులు, డయాబెటిస్, ఒబిసిటీ వచ్చే అవకాశాలున్నట్లు ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

కాకరకాయ రసంలో కొంచెం నిమ్మరసం కలుపుకుని తాగితే?

కాకరకాయ జ్యూస్‌లో కొంచెం నిమ్మరసం కలుపుకుని ప్రతిరోజూ ఉదయం పరగడుపున తాగితే అనారోగ్య ...

news

వంటకు ఈ నూనెలు మంచివే... పామ్ ఆయిల్‌ వినియోగం మోతాదుకు మించితే?

వంటకు ఉపయోగించే నూనెల ద్వారానే ఆరోగ్యంగా ఉండగలుగుతామని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇందులో ...

news

చల్లని నీరు తాగితే లివర్ చెడిపోతుందట.. నిజమేనా?

వేసవికాలంలో చాలామంది చల్లటి నీటిని సేవిస్తుంటారు. చల్లటి నీరు లేనిదే కొద్ది సేపు కూడా ...

news

మండు వేసవిలో మలయమారుతం ఖర్బుజా

వేసవిలో వేడిగాలులు, దప్పిక నుంచి శరీరాన్ని రక్షించే గుణం గల ఖర్బూజా పండు అధిక బరువును ...

Widgets Magazine