1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శనివారం, 29 ఫిబ్రవరి 2020 (21:19 IST)

నిమ్మ, ఉసిరి కాయ పచ్చళ్లు రాత్రిపూట ఎందుకు తినకూడదు?

ఆయుర్వేదంలో కొన్ని రకాల వ్యాధులు వచ్చినప్పుడు పథ్యం తప్పనిసరి అని చెపుతారు వైద్యులు. పథ్యమంటే తినతగినవి, అపథ్యం అంటే తినరానివి. బీరకాయ, పొట్లకాయ, బీట్రూట్, అరటికాయ, దొండకాయ, తోటకూర, మెంతికూర, పొన్నగంటికూర, దోసకాయ, ఆనపకాయ, పొట్టుపెసరపప్పు, మినపప్పు, కందిపప్పు, కేరట్, అరటిపువ్వుకూర తినదగిన కూరలు.
 
అపథ్యమంటే తినకూడనవి... గొఱ్ఱె మాంసం, కొబ్బరికాయ, వంకాయ, గోంగూర, చేపలు పచ్చివి, ఎండువి, పీతలు ఆవకాయ, గుమ్మడికాయ, కొత్తచింతకాయ, శనగపప్పు, ఆనుమలపప్పు తినతగనివి. 
 
తినతగిన పచ్చళ్లు.. నిమ్మకాయ, మాగాయ పచ్చడి, కరివేపాకు, కొత్తిమీర పచ్చడి, అల్లపు పచ్చడి తినవచ్చు. తినకూడని పచ్చళ్లు... వాతరోగులు, ఆనపకాయ, దోసకాయ, పెసరపప్పు, కొత్తచింతకాయ, ఉసిరికాయ పచ్చడి తినకూడదు. రాత్రి కాలమున నిమ్మకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి తినరాదు. ఎందుకు తినకూడదన్నచో రాత్రికాలమున వాతమధికముగా నుండును.

నిమ్మకాయ, ఉసిరికాయ పచ్చళ్లు తిన్నచో తలలోని సూక్ష్మాతి సూక్ష్మనాడులు పగిలిపోవటం వల్ల పక్షవాతాది రోగము రావచ్చు గాన పైన తెలిపినవి తినరాదు. పత్యం శతగుణం ప్రపోక్తం అని శాస్తోక్తం కనుక సర్వ వైద్యములకు పథ్యం చేయడం శ్రేయస్కరం.