ఆదివారం, 12 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By జె
Last Modified: శనివారం, 4 ఏప్రియల్ 2020 (14:58 IST)

కిడ్నీల ఆరోగ్యానికి ఇదొరక్కటే మార్గం?

ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఐదు లక్షలమంది ప్రజలు కిడ్నీలో రాళ్ళ సమస్యలతో బాధపడుతున్నారని సర్వేలో తేలిన అంశం. 30,50 సంవత్సరాల వయస్సు వారే ఈ సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి పరిష్కారం ఆహారంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటే కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా మనం జాగ్రత్తపడవచ్చునంటున్నారు వైద్య నిపుణులు.
 
యానిమల్ ప్రొటీన్సు వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడతాయని మాంసాన్ని అతిగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడే అవకాశం పదిరెట్లు ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అతిగా మాంసం తింటే ఇష్టపడేవారు మితిగా మాత్రమే తినాలని సూచిస్తున్నారు. 
 
అలాగే పళ్ళరసాలు తీసుకుంటూ రోజు మొత్తం మీద కనీసం రెండున్నరలీటర్లకు పైగా నీటిని తాగడం వల్ల కిడ్నీలో రాళ్ళు ఏర్పడే అవకాశం తగ్గించుకోవచ్చు అంటున్నారు. పాప్‌కార్న్ తింటూ కోకోకోలాలు, డ్రింకులు తాగడం ఓ ఫ్యాషన్‌గా మారిన రోజుల్లో కోలా డ్రింకులు కూడా కిడ్నీలో రాళ్ళు ఏర్పడడానికి దోహదం చేస్తున్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. పళ్ళ రసాల్లో ముఖ్యంగా ద్రాక్షరసం మానేస్తే మంచిదట.
 
కాఫీ, టీలు తాగేవారు రోజుకి 2,3 కప్పుల్ని మించి తాగినా మంచిది కాదని సూచిస్తున్నారు. నిమ్మరసం ఇంట్లో అప్పటి కప్పుడే తయారుచేసుకుని తాగాలి. బయట జ్యూసులు తాగడం అంత మంచిది కాదట. శరీరానికి పొటాషియం ఆవశ్యకత ఉన్న ఎక్కువగా తీసుకోవడం మంచిదికాదట. అలాగే మెగ్నీషియం, మినరల్సును సాద్యమైనంత తక్కువగా తీసుకోవాలట. 
 
మన ఆహారంలో ఉప్పు శాతాన్ని ఎంత వరకు వినియోగించుకోవాలో తెలుసుకుని వైద్యులు సలహా పాటించాలట. వీలైనంత వరకు ఆహారంలో ఉప్పు, కాల్షియం తగ్గించాలట. పాలకూర, వేరుశెనగకాయలు, పప్పు, బీన్సు, చాక్లెట్లు, కాఫీ, టీలు ఎక్కువగా సేవించకూడదని, సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉండాలని ఆహార నియమాలను ఖచ్చితంగా పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.