కాఫీ ప్రియులకో శుభవార్త.. రోజుకు మూడు కప్పుల కాఫీ మంచిదే..

కాఫీ ప్రియులకో శుభవార్త. రోజూ మూడు కప్పుల కాఫీని భయం లేకుండా లాగించవచ్చునని పరిశోధనలో తేలింది. రోజూ మూడు కప్పుల కాఫీ తాగడం ద్వారా శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుందని ఫ్రాన్స్ అంతర్జాతీయ క్యాన్

coffee
selvi| Last Updated: శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (09:16 IST)
కాఫీ ప్రియులకో శుభవార్త. రోజూ మూడు కప్పుల కాఫీని భయం లేకుండా లాగించవచ్చునని పరిశోధనలో తేలింది. రోజూ మూడు కప్పుల కాఫీ తాగడం ద్వారా శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుందని ఫ్రాన్స్ అంతర్జాతీయ క్యాన్సర్ పరిశోధన సంస్థ నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. రోజూ మూడు కప్పులకు తగ్గకుండా కాఫీని తాగితే కాలేయ పనితీరు మెరుగుపడుతుంది.

అంతేగాకుండా కాఫీ తాగని వారితో పోలిస్తే.. సాధారణంగా వచ్చే నొప్పులు కూడా కాఫీ తాగే వారిలో తక్కువగా ఉన్నాయని గుర్తించారు. కాఫీ తాగడం ద్వారా ఎలాంటి కారణం లేకుండా వచ్చే మరణాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని ఫ్రాన్స్ పరిశోధకులు తెలిపారు. ఇలా మూడు కప్పుల కాఫీ తాగితే శారీర ఆరోగ్యంపై ఎలాంటి దుష్ప్రభావం చూపట్లేదని వారు తెలిపారు.

కాఫీ తాగడం ద్వారా క్యాన్సర్‌తో పాటు కాలేయ వ్యాధులు తగ్గే అవకాశాలున్నాయి. కాఫీ మూడు కప్పులు తీసుకునే వారిలో గుండెపోటు వచ్చే అవకాశం కానీ, దానివల్ల మరణించే అవకాశం కానీ తక్కువని పరిశోధకులు వెల్లడించారు.


దీనిపై మరింత చదవండి :