శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : శనివారం, 19 మార్చి 2016 (08:49 IST)

మీరు నడుము నొప్పితో బాధపడుతున్నారా..?

సాధారణంగా మహిళలను వేధించే సమస్య నడుము నొప్పి. ఆధునిక యుగంలో మహిళలు ఇటు గృహంలోనూ, అటు పలు రంగాల్లో రాణిస్తున్నప్పటికీ, కాసేపు తీరిక దొరికి కూర్చుంటే హమ్మా నడుము నొప్పి అంటారు. 
 
అలా మీరు కూడా నడుము నొప్పితో బాధపడుతుంటే.. ఒక గ్లాసు మజ్జిగతో మూడు టీస్పూన్లు సున్నపు తేట కలుపుకుని ప్రతిరోజు ఉదయం పూట తాగినట్లైతే మూడు రోజుల్లో నడుము నొప్పి తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. 
 
ఖర్జూర పండ్లు తిని వేడినీళ్లు త్రాగితే నడుము నొప్పి తగ్గుతుందట. మేడికొమ్మపాలు పట్టువేస్తే నడుము నొప్పి ఉండదు. 
 
నల్లమందు రస కర్పూరం కొబ్బరినూనెలో కలిపి రాసినట్లైతే నడుము నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే శొంఠి గంధం తీసి నడుముపై పట్ట వేసి తెల్లజిల్లేడు ఆకులు కట్టినట్లైతే నడుము నొప్పి తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.