శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 28 జనవరి 2019 (14:40 IST)

అశ్వగంధ చూర్ణాన్ని మగవారు తీసుకుంటే..?

అశ్వగంధ పొడి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది శరీరానికి శక్తిని చేకూర్చుతుంది. లైంగిక పరమైన సామర్ధ్యాన్ని పెంచుతుంది. అశ్వగంధంలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలను ఉండడంతో ఇన్ఫెక్షన్స్‌ను దూరం చేస్తుంది. ఈ గంధాన్ని అధికంగా శ్వాసవ్యవస్థలో ఏర్పడే తీవ్ర సమస్యలను తగ్గించుటకు ఉపయోగిస్తారు. స్త్రీలలో కలిగే లైంగిక అవయవాల సమస్యలను పురుషుల్లో ఫలదీకణ స్థాయిలను మెరుగుపరుస్తుంది. అందుకని ఎక్కువ మోతాదులో అశ్వగంధాన్ని వాడకూడదు.
 
అల్జీమర్స్ వ్యాధిని తగ్గించే గుణాలు అశ్వంధ టీకి ఉన్నాయి. వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేసే యాంటీ ఏజెంట్ గుణాలు ఇందులో ఉన్నాయి. ఈ గంధంలో ఉండే సహజ సిద్ధ స్టెరాయిడ్‌లు నొప్పులు, వాపులను తగ్గిస్తాయి. కీళ్లనొప్పులను మటుమాయం చేస్తాయి. మత్తును కలిగించే ఔషధంగా అశ్వగంధాన్ని ఉపయోగిస్తారు.  శరీరానికి బలాన్ని ఇవ్వడంతో పాటు పొట్ట సంబంధిత వ్యాధులకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. 
 
అశ్వగంధం ఒత్తిడిని నివారిస్తుంది. నీరసాన్ని దరిచేరనీయదు. కండరాల వ్యాధులకు ఉపశమనంగా పనిచేస్తుంది. విషాన్ని హరించే శక్తి దీనికి అమితంగా ఉంది. అశ్వగంధ పొడిని చక్కెరతో కలిపి నెయ్యితో తీసుకుంటే నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చును. స్థూలకాయాన్ని నియంత్రిస్తుంది. డీహైడ్రేషన్‌ను తగ్గిస్తుంది. ఎముకలకు బలాన్నిస్తుంది. అదే విధంగా అశ్వగంధాన్ని మోతాదుకు మించి తీసుకుంటే గుండె, అడ్రినల్ గ్రంథులపై ప్రభావం చూపుతుంది.