Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

బరువు తగ్గాలంటే మీరు చేయాల్సినవి ఇవే...

గురువారం, 7 డిశెంబరు 2017 (16:57 IST)

Widgets Magazine

బరువు తగ్గాలని ఆహారపు అలవాట్లను మార్చుకున్నారా..? పోషకాహారం తీసుకోకుండా కడుపు మాడ్చుకుంటున్నారా? అయితే ఇక వాటినిపక్కనబెట్టి.. ఈ చిట్కాలు పాటించండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. రోజూ సూర్యోదయం శరీరంపై పడాలే చూసుకుంటేనే బరువు సులభంగా తగ్గొచ్చు. సూర్యకిరణాల ద్వారా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. 
 
ఉదయం పూట సూర్యుని కిరణాలు, సాయంత్రం సూర్యాస్తమయ కిరణాలు శరీరంపై పడటం ద్వారా బరువు సులభంగా తగ్గొచ్చునని ఇప్పటికే పలు పరిశోధనలు కూడా తేల్చాయి. సూర్య కిరణాల ద్వారా మనస్సు, శరీరానికి ఉత్తేజం లభిస్తుంది. రోజంతా చురుకుగా వుండేలా చేస్తుంది. సూర్యకిరణాలు శరీరంపై పడటం ద్వారా కేలరీలు ఖర్చవుతాయి. తద్వారా బరువు తగ్గుతారు. నాజూగ్గా వుంటారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
ఇక వ్యాయామం చేయడం ద్వారా బరువును నియంత్రించుకోవచ్చు. ఉదయం పూట అరగంట పాటు నడవటం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. అదేవిధంగా తీసుకునే అల్పాహారంలో పోషకాలుండేలా చూసుకోవాలి. ప్రోటీన్లు పుష్కలంగా వున్న అల్పాహారాలు బరువును నియంత్రించడంలో సహకరిస్తాయని న్యూట్రీషియన్లు చెబుతున్నారు. 
 
జంక్ ఫుడ్ కాకుండా ఫైబర్ కలిగి వుండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా బరువు తగ్గొచ్చు. అలాగే ఆఫీసుల్లో లిఫ్టులు వాడకపోవడం మంచిది. సాయంత్రం పూట సైక్లింగ్ చేయడం, జాగింగ్ చేయడం వంటివి ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా శరీర బరువును పెరగనీయకుండా చేస్తాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

జంక్ ఫుడ్‌ను పక్కనబెడితే సౌందర్యం మీ సొంతం

జంక్ ఫుడ్ అలవాటును మానుకుంటే అందంగా తయారవుతారని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. తీసుకునే ...

news

రోజుకో అరటిపండు తినండి.. లివర్‌ను శుభ్రం చేసుకోండి.

రోజుకో అరటిపండును తీసుకోవడం ద్వారా లివర్‌ను శుభ్రం చేసుకోవచ్చునని వైద్యులు ...

news

రాత్రి భోజనం పది గంటలు దాటితే...

రాత్రి భోజనం పది గంటల్లోపు తినేయాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అలాగే అర్థరాత్రి పూట ...

news

బంగాళాదుంపల్ని తింటే లావెక్కుతారా? (Video)

బంగాళా దుంపల్ని తింటే లావెక్కుతారని కొందరి అపోహ. ఇందులో కొంత నిజమున్నా.. మధుమేహం, ...

Widgets Magazine