గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 31 డిశెంబరు 2018 (17:06 IST)

రోజుకో గ్లాసుడు క్యారెట్ జ్యూస్ తాగితే..?

రోజుకో గ్లాసుడు క్యారెట్ జ్యూస్ తాగితే ఇట్టే బరువు తగ్గిపోతారని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. క్యారెట్‌లో పీచు అధికంగా వుంది. అవి కూడా కరిగే పీచు పదార్థాలు కావడం, క్యాల్షియం పుష్కలం. అందుచేత క్యారెట్ జ్యూస్ తాగేవారికి ఒబిసిటీ సమస్య వుండదు. క్యారెట్‌తో పాటు కీరదోసకాయ కూడా పొట్టను కరిగిస్తుంది. ఇందులోని నీటి శాతం కొవ్వు కణాలను కరిగిస్తుంది. 
 
అందుచేత బరువు తగ్గాలనుకునే వారు రోజుకో కీరదోసకాయను తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. వీటితో పాటు పరగడుపున క్యారెట్ జ్యూస్, టమోటా జ్యూస్ తీసుకుంటే.. శరీరానికి కావలసిన బీటా కెరోటిన్, యాంటీ-యాక్సిడెంట్స్, పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం వంటివి అందుతాయి. 
 
ఇంకా రోజు పరగడుపున గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, ఉప్పు చేర్చి తాగితే.. ఒబిసిటీ మాయమవుతుంది. అలాగే బరువు తగ్గాలంటే.. రోజూ ఆహారంలో ఓట్స్, చపాతీలు, పండ్లు, కూరగాయలు తీసుకుంటూ వుండాలని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.