గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: శుక్రవారం, 8 మార్చి 2024 (23:35 IST)

కిస్మిస్ పాలను తాగితే కలిగే ఫలితాలు ఏమిటి?

రక్తపోటు, రక్తంలో చక్కెరను తగ్గించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఎండుద్రాక్ష సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. ఎండుద్రాక్షలోని ఫైబర్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, ఇది గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుంది. కిస్మిస్ పండ్లతో కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము.
 
ఎండుద్రాక్ష తింటుంటే రక్తపోటు, మధుమేహం అదుపులో వుంటాయి.
ఎండుద్రాక్షలో వున్న పీచు పదార్థం జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.
గుండె ఆరోగ్యానికి మేలు చేయడంలో కిస్మిస్ అద్భుతంగా పనిచేస్తుంది.
క్యాల్షియం అధికంగా వుండే కిస్మిస్‌లను పాలలో కలుపుకుని తింటే ఎముక పుష్టి కలుగుతుంది.
ఎండుద్రాక్ష తినేవారి చర్మం ముడతలు పడకుండా కాంతివంతంగా వుంటుంది.
రాత్రిపూట పది ఎండు ద్రాక్షలను నానబెట్టి ఉదయాన్నే వాటిని పరగడుపున తింటే రక్తహీనత తగ్గుతుంది.
ఎండు ద్రాక్ష తింటే మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పి తగ్గుతుంది.