1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Updated : శుక్రవారం, 4 సెప్టెంబరు 2020 (19:36 IST)

వంకాయ తింటే ఉపయోగం సరే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వుంటాయా? (Video)

వంకాయ.. గుత్తి వంకాయ కూర అంటే లొట్టలేసుకుని తింటారు. దీనిని కూరగాయ అని పిలుస్తారు, కానీ వృక్షశాస్త్రపరంగా చెప్పాలంటే ఇది ఒక పండు. వంకాయ భారతదేశానికి చెందినది కాని ఇప్పుడు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో పండిస్తున్నారు. అనేక విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్స్, ఇతర సమ్మేళనాలకు మంచి మూలం కావడం వల్ల అవి మనకు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి.
 
ఆరోగ్యం, అందానికి కూడా వంకాయను ఉపయోగిస్తుంటారు. ఐతే కొన్ని రకాల వంకాయలను తినడం వల్ల కొన్ని దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం... రుతుస్రావంలో తేడా చేయవచ్చు. గర్భస్రావం జరగవచ్చు. ఆమ్ల సమస్యలకు కారణం కావచ్చు. అలెర్జీలకూ కారణం కావచ్చు.
 
ఇది కొన్ని రకాల వంకాయలను తిన్నప్పుడు ఇలాంటి చర్యలు జరగే అవకాశం వుందని చెపుతుంటారు. ఐతే మార్కెట్లో లభించే మంచి వంకాయలు దాదాపు ఎలాంటి హాని కలిగించవు కానీ కొన్నిసార్లు వంకాయలు పడనివారికి అలెర్జీలు వస్తుంటాయి.