బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 27 ఆగస్టు 2024 (22:49 IST)

రక్తంలో క్లాట్స్ ఏర్పడటానికి కారణమయ్యే ఆహారం ఏంటి?

blood clot
బ్లడ్ క్లాట్స్. ప్రతిరోజూ మనం తినే ఆహారాలు ఆరోగ్య ప్రయోజనాలనే కాకుండా కొన్ని హానిని కలుగజేస్తాయి. కొన్ని ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాలలో బ్లడ్ క్లాట్స్ ఏర్పడుతాయి, అంటే రక్తనాళాల్లో అడ్డుతగులుతాయి. అవేమిటో తెలుసుకుందాము.
 
వెన్న అధికంగా ఉండే పిజ్జా ఎక్కువగా తినడం వల్ల రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఫలితంగా క్లాట్స్ ఏర్పడుతాయి.
ఫ్రెంచ్ ఫ్రైస్ శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ పెంచి రక్తనాళాల్లో అడ్డుపడటంతో గుండెకు హాని కలిగిస్తుంది.
ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్ స్థాయిలు పెరగడం వల్ల అనేక సమస్యలు వస్తాయి.
ఐస్‌క్రీమ్‌లో కేలరీలు, కొవ్వు అధికం కనుక ఎక్కువగా తింటే బరువు పెరగడంతోపాటు రక్తనాళాలకు అడ్డుపడతాయి.
నూనెలో వేయించిన చికెన్ వంటకాలను ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడుతాయి.
కొవ్వు ఎక్కువగా ఉన్న మాంసాన్ని తినడం వల్ల రక్తనాళాల్లో క్లాట్స్ ఏర్పడతాయి.