శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 8 అక్టోబరు 2024 (23:39 IST)

ఎలాంటి కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిది?

coffee
కాఫీ. కాఫీ తాగవచ్చు అని కొందరంటారు, మరికొందరు కాఫీ తాగితే డేంజర్ అని అంటారు. ఐతే కాఫీ తాగితే కొన్ని వ్యతిరేక ఫలితాలుంటాయని నిపుణులు చెప్పినా, దానిని ఆరోగ్యకరంగా చేసుకుని తాగితే మంచి ప్రయోజనాలుంటాయంటున్నారు. ఐతే ఎలా చేయాలో తెలుసుకుందాము.
 
మీ కాఫీని మీరే స్వయంగా చేసుకోగలిగితే ఆ కాఫీ అన్నివిధాలా ఆరోగ్యకరం.
కెఫీన్‌ను రోజుకు ఒకటి లేదా రెండు కప్పుల కాఫీ ద్వారా వచ్చేట్లు మాత్రమే పరిమితం చేయాలి.
కాఫీని సాధ్యమైనంత అతి తక్కువ చక్కెరతో చేయండి.
కాఫీపొడి వేసే పాలు అత్యంత తక్కువ కొవ్వు పాలు వుండేట్లు ఎంపిక చేసుకోండి
సాధారణంగా కాఫీ తాగేందుకు పెద్ద కప్పును ఉపయోగిస్తుంటే, ఆ విధానానికి స్వస్తి పలకండి.
కాఫీతో పాటు ఇంకేమైనా పోషకాలు కలుపుతున్నారేమో తెలుసుకునేందుకు పోషకాహార లేబుల్‌లపై శ్రద్ధ వహించండి