అల్లం టీ ఎవరు తాగకూడదో తెలుసా?
దగ్గు, ఇతర శ్వాసకోశ సమస్యలను అల్లం టీతో తగ్గుతాయని నిపుణులు చెపుతారు. అల్లం టీ రక్తపోటును తగ్గించగలదని అధ్యయనాలు చూపిస్తున్నాయి. అల్లం టీ కొన్ని సాధారణంగా ఉపయోగించే మందుల మాదిరిగా ప్రభావవంతంగా ఉండవచ్చని అంటారు.
అల్లంలో వుండే జింజెరాల్ వల్ల ట్యూమర్లు పెరుగుదల తగ్గుతుందని ప్రయోగాలలో తేలింది. అల్లం టీ ఆర్థరైటిస్ నొప్పి, కండరాల నొప్పులను తగ్గిస్తుంది. అల్లం టీ పొట్టలోని జీర్ణ సమస్యలకు కూడా ఉపయోగించబడుతుంది.
గర్భవతిగా ఉన్నవారు, క్యాన్సర్ చికిత్స తీసుకునేవారు అల్లం టీకి దూరంగా వుంటే మంచిది. అల్లం టీ ఉదయం వేళ తాగితే మంచిదని ఆరోగ్య నిపుణుల సలహా. గమనిక: ఏదైనా అనారోగ్యానికి అల్లం టీనా తీసుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించండి.