అసలు బరువు ఎందుకు పెరుగుతారో తెలుసా..?

Last Updated: మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (15:08 IST)
కొందరైతే చిన్న వయసులో సన్నగానే ఉండేవారు. కానీ, ప్రస్తుత కాలంలో అంటే రెండు మూడేళ్ళుగా బరువు పెరుగుతున్నారు. పొట్ట కూడా బాగా పెరిగిపోతుంది. ఇలా ఎందుకు జరుగుతుంది.. పొట్ట తగ్గడానికి ఎలాంటి ఆహారాలు తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం రండీ.

చిన్నప్పటి నుండి సన్నగా ఉన్నవారు కూడా వయసు పెరిగే కొందీ బరువు పెరుగుతుంటారు. ముఖ్యంగా పాతికేళ్ళు దాటి ముప్పయి వయసు వచ్చే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యులు. లేదంటే.. బరువు పెరగడం ఖాయం మని చెప్తున్నారు. అందువలన చదువునే రోజుల్లో ఆటలు, నటక వలన కొంత శారీరక వ్యాయమం చేస్తే ఈ సమస్య నుండి విముక్తి లభిస్తుంది.

శరీరంలో జీవక్రియలు చురుగ్గా ఉంటే.. బరువు త్వరగా పెరగదు. ఉద్యోగంలో చేరిన తరువాత.. రోజులో అధిక సమయం కూర్చునే ఉండడం, శారీరక శ్రమ తగ్గడం, మానసిక ఆందోళన, సమయానికి నిద్రాహారాలు లేకపోవడం.. వంటి కారాణాల వలన బరువు నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. దానికి తోడుగా పొట్ట కూడా విపరీతంగా పెరిగిపోతుంది.

వీటన్నింటిని ముఖ్యకారణం.. రాత్రి సమయంలో ఆలస్యంగా భోజనం చేయడం, తిన్న వెంటనే నిద్రపోవడం, ఒత్తిడి మధ్య పనిచేయడం వలన కూడా పొట్ట సమస్య వస్తుంది. ఈ పొట్టను తగ్గించాలంటే.. ప్రతిరోజూ ఓ అరగంట పాటు వ్యాయామం తప్పకుండా చేయాలి. అలానే కాయగూరలు, ఆకుకూరలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి.. అప్పుడే బరువు తగ్గుతారు.దీనిపై మరింత చదవండి :