తాటి బెల్లం ఎందుకు తినాలో తెలుసా?
తాటి బెల్లం. దీన్ని తీసుకుంటే రక్తహీనతను నిరోధించడంతో పాటు ఇంకా ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. తాటి బెల్లం ఎలా వుపయోగపడుతుందో తెలుసుకుందాము.
తాటి బెల్లం తీసుకుంటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది.
తాటి బెల్లాన్ని తింటే అధిక బరువు సమస్యను తొలగించుకోవచ్చు.
తాటి బెల్లంలో ఐరన్, క్యాల్షియం, పాస్పరస్ వంటి పోషక పదార్ధాలు ఉంటాయి.
తాటి బెల్లంతో ఊపిరితిత్తులు, జీర్ణాశయం, పేగులు ఆరోగ్యంగా వుంటాయి.
తాటి బెల్లం తీసుకుంటే శ్వాసనాళం, జీర్ణ వ్యవస్థలలో మలినాలు తొలగిపోతాయి.
తాటి బెల్లంలో ఐరన్ అధికంగా ఉండటం వల్ల రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు.
తాటి బెల్లం తీసుకుంటే గ్యాస్, అసిడిటీ నుంచి బయట పడవచ్చు.
గోరువెచ్చని నీటిలో తాటి బెల్లం కలుపుకొని తాగితే జలుబు, దగ్గు, ఆస్తమా లాంటివి తగ్గుతాయి.
తాటి బెల్లం తింటే కొవ్వు కరుగుతుంది. బీపీ కంట్రోల్ అవుతుంది. లివర్ పనితనం మెరుగవుతుంది.