మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : సోమవారం, 4 ఫిబ్రవరి 2019 (13:14 IST)

తలనొప్పిని దూరం చేసేందుకు ఏం చేయాలి..?

చలికాలంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు పోషకాహారం కాస్త అధికంగా తీసుకోవాలనేది వాస్తవం. అయితే ఏదిపడితే అది కాకుండా వేడివేడి సూప్‌లు, విటమిన్ ఇ ఉండే ఆహార పదార్థాలు, ముఖ్యంగా నట్స్ ఎక్కువగా తీసుకోవడం మంచిది. 
 
తలనొప్పిని దూరం చేసేందుకు నీళ్లు ఎక్కువగా తాగాలి. వేడి కారణంగా డిహైడ్రేషన్ సమస్య వచ్చి.. తద్వారా తలనొప్పి బాధిస్తే మాత్రమే ఈ చిట్కా ఫలిస్తుంది. విద్యార్థులు పాలు కలపని కాఫీ తాగితే రాత్రిళ్లు నిద్ర రాదు. కెఫీన్ అనే ఆమ్లం నిద్ర పట్టకుండా చేస్తుంది. పైగా దీని ప్రభావం 20 గంటల వరకు ఉంటుంది. అయితే అతిగా తాగితే మాత్రం అనర్థమే. 
 
అల్లం తింటే జీర్ణక్రియ వేగవంతమవుతుంది. అల్లం కషాయంలో కొద్దిగా నిమ్మరసం ఉప్పు కలిపి తీసుకుంటే త్వరగా మార్పు కనిపిస్తుంది. గొంతు ఇన్‌ఫెక్షన్‌‍కి వేడిపాలలో పసుపు కలిపి తాగితే మంచిది. పసుపులో యాంటీ సెప్టిక్ గుణాలు అధిక మోతాదులో ఉంటాయి. ఇక వేడిపాలు, పసుపు సులువుగా నొప్పిని నివారిస్తాయి. దాంతో శరీరానికి సాంత్వన కలుగుతుంది.
 
దంతాల నొప్పికి లవంగాల నూనె భేషుగ్గా పనిచేస్తుంది. లవంగ నూనెలో దూదిని నానబెట్టకుండా.. ఒకసారి ముంచి తీసేయాలి. ఆ తరువాత నొప్పిగా అనిపించిన చోట ఉంచాలి. ఆ ప్రాంతంలో వేడినీటితో అద్దుకోవడం లేదా పుక్కిలించడం వంటివి చేయకూడదు. ఎందుకంటే దాని తాలూకు ఇన్‌ఫెక్షన్ మిగిలిన ప్రాంతాలకి వ్యాపిస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి.