మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 30 నవంబరు 2021 (21:47 IST)

అసమానతలకు చరమగీతం పాడండి, ఎయిడ్స్‌ను అంతం చేయండి

ఎయిడ్స్ మహమ్మారిని నిర్మూలించడానికి చేసిన కృషిని హైలైట్ చేయడానికి ప్రపంచం డిసెంబర్ 1న ఎయిడ్స్ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్ (HIV) వల్ల ప్రాణాపాయ స్థితితో జీవించాల్సిన వారికి మద్దతు ఇవ్వడానికి కూడా ఈ రోజు పాటిస్తారు.

 
మొదటి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం 1988లో నిర్వహించబడింది. ఎయిడ్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ప్రభావితం చేసే ప్రధాన ప్రజారోగ్య సమస్యగా మిగిలిపోయింది. వైరస్ రోగనిరోధక వ్యవస్థపై దాడి చేస్తుంది. ఇతర వ్యాధులకు దాని నిరోధకతను తగ్గిస్తుంది, ఫలితంగా రోగి జీవితాన్ని ప్రమాదంలో పడేస్తుంది.

 
ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా సమాచారం ప్రకారం, 2020లో 3.77 కోట్ల మంది ప్రజలు ఎయిడ్స్‌తో జీవిస్తున్నారు. 1984లో వైరస్‌ను తొలిసారిగా కనుగొన్నప్పటి నుంచి ప్రపంచం గణనీయమైన పురోగతిని సాధించినప్పటికీ, 2020కి సంబంధించి ముఖ్యమైన లక్ష్యాలను చేరుకోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మానవ హక్కుల కోసం "విభజన, అసమానత మరియు నిర్లక్ష్యం" ఎయిడ్స్ ప్రపంచ ఆరోగ్య సంక్షోభంగా మారడానికి అనుమతించిన కొన్ని ప్రధాన వైఫల్యాలు అని పేర్కొంది. కోవిడ్ ద్వారా పరిస్థితి మరింత తీవ్రమైంది, హెచ్ఐవితో జీవిస్తున్న అనేక మంది వ్యక్తుల జీవితాలను మరింత సవాలుగా మార్చింది.
 
ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ముఖ్యమైనది ఎందుకంటే ఇది హెచ్ఐవి వైరస్ చాలా ఎక్కువగా ఉందని, దాని పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు గుర్తుచేస్తుంది. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం 2021 థీమ్ ఏంటంటే... అసమానతలకు చరమగీతం పాడండి, ఎయిడ్స్‌ను అంతం చేయండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ, దాని భాగస్వామ్య సంస్థలు వెనుకబడిన వ్యక్తులను చేరుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టవలసిన అవసరాన్ని హైలైట్ చేస్తున్నాయి.