మంగళవారం, 7 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 1 ఏప్రియల్ 2018 (15:15 IST)

ఊబకాయం రోగుల్లో భారత్ మూడో స్థానం : వీఎస్ ఆస్పత్రి ఛైర్మన్

ఊబకాయం సమస్యతో బాధపడేవారే సంఖ్యలో భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉందని వీఎస్ ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ సుబ్రమణియన్ అన్నారు. అహ్మదాబాద్‌ కేంద్రంగా సేవలు అందిస్తున్న ఏషియన్ బేరియాట్రిక్ హాస్పిటల్‌తో కలిసి

ఊబకాయం సమస్యతో బాధపడేవారే సంఖ్యలో భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉందని వీఎస్ ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ సుబ్రమణియన్ అన్నారు. అహ్మదాబాద్‌ కేంద్రంగా సేవలు అందిస్తున్న ఏషియన్ బేరియాట్రిక్ హాస్పిటల్‌తో కలిసి చెన్నైలో బేరియాట్రిక్, మెటబాలిక్ చికిత్సా కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఒక అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
 
ఈ సందర్భంగా డాక్టర్ సుబ్రమణియన్ మాట్లాడుతూ, ప్రపంచంలో కోట్లాది మంది ఊబకాయ సమస్యతో బాధపడుతుందన్నారు. ముఖ్యంగా, ఊబకాయుల్లో భారత్ మూడో స్థానంలో ఉందన్నారు. దీనికంతటికి కారణం ఒబేసిటీ, టైప్ 2 డయాబెటీస్‌పై సరైన అవగాహన లేకపోవడమేనని చెప్పారు. ఇందుకే ఊబకాయులకు అత్యంత సులభతరంగా ఎలాంటి హాని లేకుండా సర్జరీ చేసేందుకు వీలుగా ఏషియన్ బేరియాట్రిక్ ఆస్పత్రితో ఒక అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు చెప్పారు. దీంతో చెన్నై నగరంలో ఒబేసిటీ, డయాబెటిస్‌, కాస్మాటిక్ సర్జరీలు చెన్నై నగరంలో కూడా అందుబాటులోకి వచ్చాయన్నారు. తాజా సర్వే ప్రకారం భారత్ 7.5 కోట్ల మంది డయాబెటీస్‌తోనూ, 8 కోట్ల మంది టైప్ 2 డయాబెటీస్‌తోనూ బాధపడుతున్నారని చెప్పారు. 
 
అనంతరం ఏషియన్ బేరియాట్రిక్ ఆస్పత్రి ఛైర్మన్ డాక్టర్ మహేంద్ర నర్వారియా మాట్లాడుతూ, బేరియాట్రిక్ సర్జరీ కేవలం ఊబకాయులకు మాత్రమే కాదనీ, నియంత్రణ లేని డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్న వారికి కూడా ఇది ఎంతగానో దోహదపడుతుందన్నారు. ప్రపంచంలో ప్రతి సెకనుకు చక్కెర వ్యాధి అనారోగ్య సమస్యలతో ఒకరు చనిపోతున్నారనీ ఆయన గుర్తుచేశారు. ఆహార నియమాలు, వ్యాయామం, మందుల వల్ల నియంత్రించలేని ఊబకాయం చికిత్సకు బేరియాట్రిక్, మెటబాలిక్ సర్జరీ సహాయపడతాయని చెప్పారు.
 
కాగా, స్థానిక చెట్‌పెట్‌లో ఉన్న వీఎస్ ఆస్పత్రి సూపర్ స్పెషాలిటీ సేవలను అందిస్తోంది. ముఖ్యంగా, కాస్మాటిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ, జనరల్ సర్జరీ, ఎమర్జెన్సీ కేర్ అండ్ క్రిటికల్ కేర్, హెపటో బిలియరీ, బేరియాట్రిక్ సర్జరీ, ట్రాన్స్‌ప్లాంట్ సర్వీసెస్, ల్యాప్రోస్కోపిక్, న్యూరోసైన్సెన్స్, మెడికల్ అండ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంటర్నాలజీ వంటి అధునాతన సర్వీసులను అందిస్తోంది. ఇపుడు ఏసియన్ బేరియాట్రిక్ ఆస్పత్రి సహకారంతో కొత్తగా బేరియాట్రిక్, మెటబాలిక్ సర్జరీ కోసం ప్రత్యేక విభాగం సేవలు అందుబాటులోకి తెచ్చింది.