Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అబద్దం ఆడితే ఆకులు రాల్తాయ్... అది సినిమాలో... వాస్తవంలో అయితే...

మంగళవారం, 12 సెప్టెంబరు 2017 (15:48 IST)

Widgets Magazine
Brahmanandam

తమకు తెలిసిన వారిని గుర్తించి కూడా అబద్దం చెబుతున్న వారిని వారి కంటి కదలికలే పట్టించేస్తాయని తాజా అధ్యయనం చెబుతోంది. ప్రత్యేకించి టెర్రరిస్ట్ సెల్స్, గ్యాంగులు వంటి నేర యంత్రాంగాలకు చెందిన ముఖ్యుల ఉనికిని నిర్ధారించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు పోలీసు శాఖకు ఈ కొత్త ఆవిష్కరణ ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
 
బ్రిటన్‌లోని పోర్ట్స్‌మౌత్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు ఐ ట్రాకింగ్ టెక్నాలజీని ఉపయోగించి ఓ కొత్త విషయాన్ని కనుగొన్నారు. తాము గుర్తించిన ముఖాలను చూస్తున్నప్పుడు ప్రజల కళ్లు వివిధ రకాలుగా కదులుతాయని వారు గమనించారు. తమ నెట్ వర్క్‌లోని ఇతర నేరస్తుల గురించి తమకు తెలీదని పట్టుబడిన నేరస్థులు తరచుగా అబద్ధమాడుతుంటారు. కానీ అలా వారు అబద్ధం చెప్పినప్పటికీ ఆ గ్యాంగులోని అనుమానితుల ముఖాలను వారికి చూపిస్తున్నప్పుడు వాళ్లు అబద్ధమాడుతున్నదీ లేనిదీ ఆ క్షణంలో వారి కంటి కదిలికల బట్టి ఇట్టె చెప్పేయవచ్చని  వర్శిటీ పరిశోధకులు చెప్పారు.
 
ఈ అధ్యయనంలో భాగంగా వర్శిటీ పరిశోధకులు 59 మంది వ్యక్తుల కంటికదలికలను రికార్డు చేశారు. ప్రత్యేకించి వారికి పరిచయం ఉన్న, పరిచయం లేని 200 మందికి చెందిన డిజిటల్ కలర్ ఫొటోగ్రాఫ్‌లను వారికి చూపిస్తూ వారి కంటి కదలికలను పరిశీలించారు. ఆ ఫోటోలను గుర్తించినప్పుడు అద్యయనంలో భాగమైన వారు తమకు ఆ వ్యక్తులెవరో తెలీదని అబద్దం చెప్పారు. కొన్నిసార్లు వారు తమకు తెలుసని నిజం చెప్పారు.
 
అపరిచిత వ్యక్తుల ఫోటోలను చూసేటప్పుడు కాకుండా, పరిచితుల ముఖాలను చూస్తున్నప్పుడు వ్యక్తుల కంటి కదలికలు మామూలు కంటే విభిన్నంగా కనిపించాయని ఈ బ్రిటన్ యూనివర్శిటీ పరిశోధకులు కనిపెట్టారు. మాటల్లో పలానా వ్యక్తి తనకు తెలీదని వారు అబద్ధమాడినా, పారి కంటి కదలికలు మాత్రం అసాధారణంగా కదలి వారు అబద్ధం చెబుతున్నారని స్పష్టం చేశాయ.
 
రహస్యంగా దాచిన సమాచార పరీక్షగా పేరొందిన మెమరీ డిటెక్షన్ టెక్నిక్‌ను అభివృద్ధి పరిచే కృషిలో భాగంగా అలీసా ఆమె సహ పరిశోధకులు కంటిపాపలు చెప్పే వాస్తవ రహస్యాల గుట్టును విప్పి చెప్పారు.
 
దాచిపెట్టిన వస్తువు లేదా వ్యక్తికి చెందిన  అసలు గుర్తింపును, వాస్తవాన్ని కనిపెట్టేందుకు దశాబ్దాలుగా శాస్త్ర అధ్యయనాలు సాగిస్తున్న లాబరేటరీ ప్రయోగ పద్ధతులను బ్రిటన్ వర్శిటీ పరిశోధకులు గణనీయంగా మెరుగుపర్చారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

కారు నడుపుతూ నిద్రపోతే ఆ బెల్టు అరుస్తుంది...

వాహనం నడిపేవారు నిద్రమత్తులో జారుకుంటే ఎన్నో ప్రమాదాలకు కారణమవుతుంది. ప్రతి సమస్యకు ...

news

పొట్టలో పేరుకుపోయిన కొవ్వుతో మహిళలకు ఆ ముప్పు తప్పదట?

మహిళల్లో బరువు ప్రమాదకరం.. అది క్యాన్సర్‌కు దారితీస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ...

news

ఆస్తమాకు, ఒబిసిటీకి దివ్యౌషధం బెండకాయ

ఆస్తమాకు బెండకాయ దివ్యౌషధంగా పనిచేస్తుంది. వర్షాకాలంలో, చలికాలంలో ఆస్తమా వ్యాధిగ్రస్థులు ...

news

చక్కెర వ్యాధికి చెక్ పెట్టే చిలగడదుంప...

చిలగడ దుపం.. ఈ దుంపలను ఒక్కో ప్రదేశంలో ఒక్కో పేరుతో పిలుస్తారు. వీటికి కందగడ్డ, స్వీట్ ...

Widgets Magazine