తొలి కలర్ ఎక్స్‌రే.. ఎముకలు, కండరాలు బాగా కనిపిస్తాయట..

శుక్రవారం, 13 జులై 2018 (13:59 IST)

వైద్య శాస్త్రం మరో అడుగుముందుకేసింది. యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ (సీఈఆర్ఎన్ - సెర్న్) తొలిసారిగా కలర్ ఎక్స్‌రేను తీసి చూపించింది. ఇందుకోసం అవసరమైన ఇమేజింగ్ టెక్నాలజీని అందించింది. న్యూజిలాండ్ సైంటిస్టులు తొలిసారిగా ఈ కలర్ ఎక్స్‌రేను తీసి చూపించారు. అది కూడా త్రీ డైమన్షన్‌లో మెడికల్ డయాగ్నస్టిక్ విభాగంలో కలర్ ఎక్స్ రే తీశామని ఇదో మైలురాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 
 
2012లో శూన్య బిలాలను కనుగొనేందుకు తయారైన హార్డన్ కొలైడర్ కోసం ఈ సాంకేతికతను సెర్న్ తయారు చేసింది. ఈ ఎక్స్ రేలతో వైద్యులు తమ రోగులకు ఉన్న వ్యాధి గురించి మరింత కచ్చితంగా తెలుసుకుంటారని సెర్న్ వెల్లడించింది. 
 
కలర్ ఎక్స్ రే ద్వారా రోగాలను గుర్తించడం సులభమని.. అందుకు తగిన చికిత్సను కూడా త్వరగా చేయొచ్చునని సెర్న్ శాస్త్రవేత్తలు వెల్లడించారు. హై రెజల్యూషన్, హై కాంట్రాస్ట్‌తో చిత్రాలు లభిస్తాయని ఈ సాంకేతికత అభివృద్ధికి సహకరించిన యూనివర్శిటీ ఆఫ్ సెంటర్ బురీ ప్రొఫెసర్ ఫిల్ బుట్లర్ వెల్లడించారు. 
 
ఈ ఎక్స్‌రేలో ఎముకలు, కండరాల మధ్య తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుందని, క్యాన్సర్ కారక ట్యూమర్లుంటే వాటి పరిమాణం ఎంత ఉందన్న విషయాన్నీ ఈ కలర్ ఎక్స్‌రే ద్వారా సులభంగా గుర్తించవచ్చునని బుట్లర్ తెలిపారు.దీనిపై మరింత చదవండి :  
కలర్ ఎక్స్‌రే కండరాలు ఎముకలు న్యూజిలాండ్ Cern First Human Bone Muscle Colour X-ray Mars Bioimaging New Zealand

Loading comments ...

ఆరోగ్యం

news

మూడీగా వున్నారా? అలా ఎండలో కాసేపు నిలబడితే..?

మూడీగా వున్నారా? అయితే ఎండలో కాసేపు గడపండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. పని ఒత్తిడి, ...

news

చెవినొప్పికి ముల్లంగి నూనెను తీసుకుంటే?

ముల్లంగి దుంపల్లో ఎన్నో అద్భుతమైన ఔషధ గుణాలున్నాయ. ముల్లంగి ఆకుల్లో క్యాల్షియం, పాస్పరస్, ...

news

అజీర్తితో బాధపడుతున్నారా? ఈ చిట్కాలు పాటిస్తే?

కొన్ని ఆహార పదార్ధాలు ఎక్కువగా తినడం వలన అజీర్తి కలుగుతుంది. అటువంటపుడు దానికి విరుగుడుగా ...

news

టైమ్ పాస్ కోసం తింటున్నారా..? ఐతే జాగ్రత్త సుమా..

టైమ్ పాస్ కోసం.. ఆకలేయకపోతున్నా.. సరదాగా స్నేహితులతో కలిసి తింటున్నారా..? అయితే అనారోగ్య ...