బుధవారం, 17 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By chj
Last Modified: సోమవారం, 8 మే 2017 (22:22 IST)

పాప్‌కార్న్ తింటే గుండె సంబంధ వ్యాధులు వస్తాయా...?

పాప్ కార్న్‌ సినిమా థియేటర్లలో సినిమా చూస్తూ తినేస్తుంటారు చాలామంది. ఐతే ఈ పాప్ కార్న్ తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయంటున్నారు సైంటిస్టులు. ప్రయోగాల ద్వారా ఈ విషయం తేటతెల్లమయినట్లు చెపుతున్నారు.

నాన్‌స్టిక్ కుక్వేర్, ప్యాకింగ్ చేసినటువంటి పాప్ కార్న్ వంటి వాటిలో పెర్‌ఫ్లొరూక్టానిక్ ఆసిడ్ రసాయనం ఉన్నట్లు వారు కనుగొన్నారు. ఈ రసాయనానికి పాప్ కార్న్‌కి గుండె జబ్బులకు లింకు ఏంటి అని సందేహం కలుగవచ్చు. దీనిపైనే వారు పరిశోధనలు చేశారు. 
 
ఇలాంటి పదార్థాలను తీసుకునే వెయ్యిమందిపై పరీక్షలు నిర్వహించగా వారి రక్తంలో ఈ రసాయనం ఎక్కువ మోతాదులో ఉన్నట్లు కనుగొన్నారు. దీనివల్ల గుండె సమస్యలు తలెత్తినట్లు కూడా వారు కనుగొన్నారు. ఐతే దీనిని ఇంకా పూర్తిగా నిర్థారించలేదని నిపుణులు వెల్లడించారు. పరిశోధనలు ఇంకా చేయాల్సి ఉందని పేర్కొన్నారు.