స్మార్ట్‌ఫోన్లను అతిగా వాడుతున్నారా? ఐతే హ్యాపీ హుష్ కాకి

బుధవారం, 24 జనవరి 2018 (10:20 IST)

mobile phone

స్మార్ట్‌ఫోన్లను అతిగా వాడుతున్నారా? అయితే ఆనందం కోల్పోతున్నట్టే. స్మార్ట్‌ఫోన్ల వాడకంలో యువత ముందుంటోంది. ఛాటింగ్ పేరుతో గంటలతరబడి స్మార్ట్ ఫోన్లు వాడితే.. ఆనందాన్ని.. సంతోషాన్ని కోల్పోతారని యువతపై యూనివర్సిటీ ఆఫ్‌ జార్జియాకు చెందిన పరిశోధకులు తెలిపారు. సుమారు 10 లక్షలకు పైగా అమెరికన్ టీనేజర్లపై నిర్వహించిన ఈ సర్వేలో విద్యార్థులు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్స్, కంప్యూటర్లపై అధిక సమయం వెచ్చిస్తున్నారని తెలిసింది. 
 
అయితే స్మార్ట్ ఫోన్లు వాడే టీనేజర్లలో సంతోషం గల్లంతవుందని.. కంప్యూటర్‌ గేమ్స్‌, సోషల్‌ మీడియా, మెసేజ్‌, వీడియో చాటింగ్‌ వంటి వాటిల్లో ఎక్కువ సమయం వెచ్చిస్తున్న యువత కంటే ఇతరులతో సత్సంబంధాలు నెరపుతున్న యువత సంతోషంగా వుంటోందని వెల్లడైంది. దీంతో సోషల్‌ మీడియా అధికంగా ఉపయోగించడం వల్ల యువతలో సంతోషం కనుమరుగు అవుతోందని తేల్చారు.
 
అందుకే పరిశోధకులు ఏమంటున్నారంటే.. గంటల తరబడి స్మార్ట్‌ ఫోన్లకు అతుక్కు పోకుండా నేరుగా స్నేహితులతో మాట్లాడడం, ఆటలాడడం, వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. సోషల్‌ మీడియాను పరిమితంగా వాడితేనే సంతోషం లేకుంటే హ్యాపీ హుష్ కాకి అంటూ పరిశోధకులు వెల్లడిస్తున్నారు.దీనిపై మరింత చదవండి :  
Youngesters Happy Tabs Computers Smart Phone Social Media Video Chating

Loading comments ...

ఆరోగ్యం

news

అన్నం వండేటప్పుడు వంచే వేడివేడి గంజిని ఇలా తాగితే?

అన్నం వండేటప్పుడు వంచే వేడివేడి గంజిని ఉప్పేసుకుని కాసేపు ఆరిన తర్వాత తాగితే శ్వాస ...

news

మధుమేహానికి చెక్ పెట్టాలా? చేపలు తినాల్సిందే..

చేపలను వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా మధుమేహాన్ని దూరం చేసుకోవచ్చునని ఆరోగ్య ...

news

బంతిపూలతో డెంగ్యూ - చికెన్ గున్యాలకు చెక్

డెంగ్యూ, మలేరియా, గున్యా, వంటి వ్యాధులు వెంటాడుతున్నాయా? అయితే మీ ఇంటి ఆవరణలో బంతిపూల ...

news

కిడ్నీలో రాళ్ళను కరిగించే జ్యూస్...

కిడ్నీలో రాళ్ళు ఉన్నవారు పడే బాధ వర్ణనాతీతం. ఆపరేషన్ చేయించుకునేవరకు ఉపశమనం లభించదు. ...