మంగళవారం, 25 ఫిబ్రవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By chj
Last Modified: మంగళవారం, 20 ఫిబ్రవరి 2018 (19:42 IST)

శృంగారంలో విఫలం... ఏదేదో తినేబదులు ఇవి తింటే చాలు...

ఉదయం లేచింది మొదలు ఉరుకులు పరుగుల జీవితంలో శరీరానికి, మనసుకి అస్సలు విశ్రాంతి ఉండడంలేదు. దీనివల్ల మగవారిలో రోజురోజుకి శారీరక వాంఛలు మందగించే ప్రమాదం ఉందని తాజాగా ఒక సంస్థ చేసిన సర్వేలో వెలుగులోకి వచ్చాయి. ఒకప్పటితో పోల్చుకుంటే ప్రస్తుతం ఉన్న మగవారిలో

ఉదయం లేచింది మొదలు ఉరుకులు పరుగుల జీవితంలో శరీరానికి, మనసుకి అస్సలు విశ్రాంతి ఉండడంలేదు. దీనివల్ల మగవారిలో రోజురోజుకి శారీరక వాంఛలు మందగించే ప్రమాదం ఉందని తాజాగా ఒక సంస్థ చేసిన సర్వేలో వెలుగులోకి వచ్చాయి. ఒకప్పటితో పోల్చుకుంటే ప్రస్తుతం ఉన్న మగవారిలో శృంగార సామర్థ్యం తగ్గిపోతుందని ఆ నివేదికలో పేర్కొంది. ఈ శాతం భారతదేశంలో ఎక్కువగా ఉందని కూడా ఆ నివేదికలో తెల్పింది. మగవారిలో లైంగిక సామర్థ్యం తగ్గి సంతాన సమస్యలు తలెత్తున్నాయి. ఈ సమస్యల నుండి బయటపడాలంటే మగవారు శారీరక శక్తిని పెంచే ఆహారం  ఎక్కువగా తీసుకోవాలి. అవేంటో చూద్దాం. 
 
1. తేనెకు టెస్టోస్టిరాన్ స్థాయిలను పెంచే గుణం ఉంది. దీనిలో బోరోన్ అనే మినరల్ మగవారిలో చక్కగా అంగస్తంభన జరిగేట్లు ఉపయోగపడుతుంది.
 
2. ఆవాలు, మినుములు నానబెట్టి పొట్టు తీసి వాటిని ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని పాలల్లో కలిపి పంచదార వేసి పాయసంలా వండి రోజూ తింటూ ఉంటే నలభై రోజుల తరువాత అమితమైన వీర్యశక్తి కలుగుతుంది.
 
3. పుచ్చకాయ రసంలో ఆరెంజ్ రసం లేదా నిమ్మరసం కలిపి తాగితే న్యాచురల్ వయాగ్రాలా ఉపయోగపడుతుంది.
 
4. డ్రైపిష్‌లో ఒమేగా3, ఫోలిక్ యాసిడ్స్ ఉండటం వల్ల లైంగిక శక్తిని పెంచడంతో పాటు హార్ట్ ఎటాక్ రాకుండా కాపాడుతుంది.