యువతలో "ఆ" పవర్ ఎందుకు తగ్గుతోంది...

సోమవారం, 11 జూన్ 2018 (10:44 IST)

నేటి యువతలో శృంగార సామర్థ్యం తగ్గిపోతోంది. దీనికి కారణాలను కూడా సర్వేలు విశ్లేషిస్తున్నాయి. లైంగిక సామర్థ్యం, ఆసక్తి తగ్గడానికి మానసిక, శారీరక, ఆరోగ్య సమస్యలు కూడా ఓ కారణంగా ఉంది. చాలామందిలో ఎలాంటి సమస్య లేకపోయినా ఆసక్తి సన్నగిల్లుతుంది. వీటితో పాటు.. ప్రస్తుత ఆహారపు అలవాట్లు కూడా మరో కారణంగా ఉన్నాయి. అయితే, నానాటికీ సన్నగిల్లిపోతున్న లైంగిక పటుత్వాన్ని పెంచుకోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం.
 
ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఒత్తిడికి ఆమడ దూరంలో ఉండాలి. తీసుకునే ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వులు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు అధికంగా లభించే ఆహారాన్ని తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్లతో కూడిన పండ్లు, ఆకుకూరలు, ఆహార పదార్థాలను ఆరగించాలి. 
 
బాదం, జీడిపప్పు, అక్రోట్స్‌లాంటి నట్స్ క్రమం తప్పకుండా తీసుకోవాలి. వీటిలో సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచే సెలీనియం, జింక్‌తో పాటు ఇతర పోషకాలు ఉంటాయి. ఇవి మెదడులో డొపమైన్ స్థాయిలను పెంచడానికి దోహదం చేస్తాయి. ఈ డొపమైన్ వల్ల శృంగార కోరికలు పెరుగుతాయి.
 
ప్రొటీన్లు పుష్కలంగా లభించే గుడ్లును రోజూ తీసుకుంటే అలసట దూరమవుతుంది. కోల్పోయిన శక్తిని తిరిగి పొందడానికి తోడ్పడతాయి. అంగ స్తంభనలోపం బారిన పడుకుండా కాపాడే ఆమైన్ ఆమ్లాలు గుడ్లు ద్వారా లభిస్తాయి.
 
స్ట్రాబెర్రీ గింజల్లో జింక్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. వీర్యం ఉత్పత్తికి అవసరమైన పురుష హార్మోన్ టెస్టోస్టీరాన్‌ను జింక్ నియంత్రిస్తుంది. సెక్స్ కోరికల ఉద్దీపన కలుగజేస్తుంది. కాఫీలోని కెఫైన్‌ మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరిచి ఫ్యాట్ స్టోర్స్‌ను విడుదల చేసి, రాత్రికి సరిపడా శక్తిని ఇస్తుంది. దీనిపై మరింత చదవండి :  
శృంగారం లైంగిక పటుత్వం లైంగిక సామర్ధ్యం యువత Power Youth Romanc Low Romance Stamina

Loading comments ...

ఆరోగ్యం

news

ప్రపంచంలోనే అరుదైన బ్లడ్ గ్రూప్.. 40 మంది వద్దే ఉంది...

సాధారణంగా ఏ, బీ, ఎబీ, ఓ బ్లడ్ గ్రూపుల గురించే మనం వినివుంటాం. కానీ దీనికితోడుగా మరో బ్లడ్ ...

news

సజ్జ పిండిలో బెల్లం కలిపి రొట్టెలా చేసుకుని తింటే...

ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల్లో ఊబకాయ సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్య వల్ల అనేక ...

news

బాదం పాలు తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలో...

బాదం పప్పు శరీర ఆరోగ్యానికి, మానసిక ఆరోగ్యానికి మంచిది. పోషకాహారంగానే కాకుండా కొన్ని ...

news

కొవ్వు పదార్థాలు... అమ్మాయిల బ్రెస్ట్ సైజుల్లో పెరుగుదల : సర్వేలు

అమ్మాయిల ఎద ఆకృతులు (బ్రెస్ట్ సైజులు) పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా 20 నుంచి 30 యేళ్ళ లోపు ...