శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 4 జూన్ 2018 (11:09 IST)

అసిస్టెంట్ భార్యతో ఫాస్టర్ రాసలీలలు.. సీసీ కెమెరాలో అడ్డంగా బుక్కు...

ఓ మత ప్రబోధకుడు అడ్డంగా చిక్కిపోయాడు. తన వద్ద అసిస్టెంట్‌గా పని చేసే భార్యతో రాసలీలలు కొనసాగిస్తూ సీసీ కెమెరాల్లో దొరికిపోయాడు. నిజానికి ప్రార్థనా మందిరానికి వచ్చే వారందరికి మంచి లక్షణాలు, భక్తి, సేవా

ఓ మత ప్రబోధకుడు అడ్డంగా చిక్కిపోయాడు. తన వద్ద అసిస్టెంట్‌గా పని చేసే భార్యతో రాసలీలలు కొనసాగిస్తూ సీసీ కెమెరాల్లో దొరికిపోయాడు. నిజానికి ప్రార్థనా మందిరానికి వచ్చే వారందరికి మంచి లక్షణాలు, భక్తి, సేవాగుణం, మానవత్వం ఉండాలని ప్రబోధిస్తుంటాడు. హితబోధ చేస్తుంటాడు. కానీ తనకు మాత్రం అవేమీ ఉండనక్కర్లేదనేలా వ్యవహరించి అడ్డంగా దొరికిపోయాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
అనంతపురం పట్టణంలోని రాంనగర్‌లో ఓ వ్యక్తి ప్రబోధకుడుగా చెలామణి అవుతున్నాడు. ఈయన వద్ద ఓ వ్యక్తి సహాయకుడిగా పని చేస్తున్నాడు. ఈ కారణంగా ఇరువురు కుటుంబాల మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఈ క్రమంలోనే ప్రబోధకుడు, సహాకుడి భార్య మధ్య పరిచయం కాస్త ఎక్కువై వారి ఇంటిదాకా వచ్చేవరకు దారి తీసింది. 
 
అతడు తరచూ ఇంటికి వస్తుండటంతో అనుమానం వచ్చి సహాయకుడు తన ఇంట్లోని పడక గదిలో సీసీ కెమెరాలను అమర్చాడు. ఎప్పటిలాగే ఇటీవల అతడు ఆమె ఇంటికి వచ్చాడు. ఇద్దరు కలిసి రాసలీలల్లో మునిగిపోయారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డయ్యాయి. ఈనేపథ్యంలో తగిన ఆధారాలతో సహాయకుడు నాలుగో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.